శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 06, 2020 , 04:00:20

తల్లుల దర్శనానికి తరలుతున్న జనం

తల్లుల దర్శనానికి తరలుతున్న జనం
  • - గట్టమ్మకు తొలి మొక్కులు

ములుగురూరల్‌, ఫిబ్రవరి 05: ములుగు జిల్లా కేంద్రం జాకారం గ్రామపంచాయతీ పరిధిలోని గట్ట మ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. బుధవారం సా రలమ్మ గద్దెకు చేరిన సందర్భంగా తల్లిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. నేడు సమ్మక్క తల్లి గద్దెకు చేరనున్నం దున మొక్కులు చెల్లించేందుకు భారీగా మేడారానికి తరలివస్తున్నారు. 


ఆలయం వద్ద భారీ బందోబస్తు 

గట్టమ్మ ఆలయం వద్ద భక్తుల సంఖ్య పెరుగుతుం డటంతో ములుగు ఎస్సై బండారి రాజు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కూలైన్ల ద్వారా భక్తులను పంపిస్తూ ప్రత్యేక చర్యలు చేపట్టారు. అదేవిధంగా భక్తులు తరలివచ్చే వాహనాలను గట్టమ్మ వద్ద విధులు నిర్వహిస్తున్న పో లీసులు పార్కింగ్‌ స్థలాల్లోకి ఎప్పటిప్పుడు తరలించే చర్యలను చేపట్టారు. 


logo