సోమవారం 06 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 06, 2020 , 03:50:08

పగిడిద్దరాజుకు ఘన స్వాగతం

పగిడిద్దరాజుకు ఘన స్వాగతం

గోవిందరావుపేట: మహబూబాబాద్‌ జిల్లా పూనుగొండ్ల నుంచి బ యలుదేరిన పగిడిద్దరాజు మంగళవారంరాత్రి మండలంలోని లక్ష్మీపు రం గ్రామానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా స్థాని క పూజారులు ఘ నంగా స్వాగతం పలికి, పూజలు ని ర్వహించారు. రా త్రి ఇక్కడే బస చేసి న పగిడిద్దరాజు బుధవారం ఉదయం పస్రాకు  చేరుకోగా స్థానిక సర్పం చ్‌ ముద్దబోయిన రాముతో కలిసి పెనక వంశీయులు ఘనంగా స్వాగ తం పలికారు. భక్తులు పెద్దఎత్తున కొబ్బరికాయలు కొడుతూ తాము కోరిక కోర్కెలు నెరవేర్చాలని వేడుకున్నారు. మేడారం జాతర తరహాలోనే తిరుగువారమైన ఈనెల 12, 13, 14 తేదీల్లో పూనుగొండ్లలో మహాజాతర నిర్వహించేలా ప్రభుత్వం నిధులు కేటాయించాలని ప్ర ధాన పూజారి పెనక మురళీధర్‌ కోరారు. పస్రా ఎస్సై మహేంద్రకుమా ర్‌ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పెనక బుచ్చిరాములు, పెనక చెన్నేశ్వర్‌రావు, పెనక వెంకటేశ్వర్లు, పెనక సుగు ణ, పెనక నర్సింగరావు, పూజారులు పాల్గొన్నారు. 


logo