బుధవారం 01 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 05, 2020 , 04:20:10

తల్లి రాక కోసం....

తల్లి రాక కోసం....
  • నేడు అగ్రంపహాడ్‌లో జాతర షురూ
  • గద్దెకు చేరుకోనున్న సారలమ్మ

ఆత్మకూరు, ఫిబ్రవరి 04: వరంగల్‌ రూరల్‌ జి ల్లా ఆత్మకూరు మండలం మినీ మేడారం అగ్రంపహాడ్‌లో కొలువైన సమ్మక్క-సారలమ్మ దర్శనం కోసం జనం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.  జాతర కోసం ఇటు అధికారులు, అటు జాతర ని ర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి రెండేళ్లకోసారి అత్యంత వైభవంగా మేడారం తరహాలో విరాజిల్లుతున్న అగ్రంపహాడ్‌ సమ్మక్క-సారలమ్మ జాతర తొలిఘట్టం సారక్క రాకతో బుధవారం ప్రారంభంకానుంది. మంగళవారం వనదేవతలైన సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద వేలాది మంది భక్తులు పసుపు, కుంకుమ, బెల్లం (బంగారం) ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. 


గోనెల వెంకన్న ఇంటి నుంచి..

పూజారి గోనెల వెంకన్న ఇంట్లో కొలువైన సారలమ్మకు ఉదయం కొబ్బరి కాయ కొట్టి పసుపు, కుంకుమ భరణితో పూజలు చేస్తారు. సారక్కకు గుళ్లపల్లి సాంబశి వరావు పసుపు, కుంకుమ భరిణితో, బొమ్మగాని సత్యం సురాపానకం (ఘటం కుం డ), కాసుల సాంబయ్య పైడి కన్ను ముత్యం, పగడం, వెండికన్ను, గోనెల రవీందర్‌ ఇంట్లో నుంచి వరాల కుండలు తీసుకొచ్చి సమర్పిస్తారు. అనంతరం పూజారులు గోనెల సర్సింహరాము లు గుల్లపల్లి సాంబశివరావు, గోనెల సారంగపాణి, గోనెల రవీందర్‌, గోనెల విశ్వనాథ్‌, శివ, ఉడుతనబోయిన గోవర్ధన్‌, గోనెల భాస్కర్‌, రేగు ల సునీత, గోనెల లక్ష్మి ప్రత్యేక పూజలు చే స్తారు. సాయంత్రం 7గంటలకు పూజారి గో నెల వెంకన్న సారక్కను డప్పుచప్పళ్లు ఎదుర్కోళ్లు, లక్షలాదిమంది భక్తుల నడుమ గద్దెపైకి తీసుకొస్తాడు.


ఏర్పాట్లు పూర్తి

అగ్రంపహాడ్‌ జాతర ప్రాంగణంలో అన్ని ఏ ర్పాట్లు పూర్తి చేసినట్లు చైర్మన్‌ కత్తెరశాల మల్లేశం, డైరెక్టర్లు గుండెబోయిన రాజన్న, చెంచు ప్రభాకర్‌, మోరె మహేందర్‌, మడిపల్లి భాగ్య తెలిపారు. ఏసీపీలు శ్రీనివాస్‌, శ్యాంసుందర్‌, రమేశ్‌ సిబ్బందితో జాతర ప్రాంగణాన్ని పర్యవేక్షించారు.


మా ఆరాధ్యదైవాలు

మా కుటుంబ ఆరాధ్య దైవాలు సమ్మక్క-సారలమ్మలు. శక్తి రూపంలో ఉ న్న అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తాం. సారక్కను గద్దెపైకి తీసుకెళ్లేటప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. అమ్మవారు గ ద్దెపై కొలువుదీరే క్రమం శక్తి రూపం. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం మా వనదేవతలు సమ్మక్క-సారక్కలు.

  • గోనెల వెంకన్న, సారలమ్మ పూజారి

మౌన సంభాషణ !

మినీ మేడారంగా ప్రసిద్ధిగాంచిన అగ్రంపహాడ్‌ సమ్మక్క-సారలమ్మ జాతరలో అతడే కీలకం.. లక్షలాది మంది భక్తుల కొంగుబంగారంగా కొలిచే సమ్మక్కను గద్దెపైకి తీసుకురావడం ఆయనకు వా రసత్వంగా, వం శపారంపర్యంగా లభించింది. ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు సమ్మక్క తల్లిని గద్దెపైకి తీసుకొచ్చాడు. అమ్మవారిని తన ఇంటి నుం చి గద్దెమీదకి తీసుకువచ్చేటప్పడు భక్తులు ఆయనను వనదేవతగానే కొలుస్తారు. ఆయనే సమ్మక్క పూజారి గోనెల సారంగపాణి. ఇతడు పుట్టుకతోనే మూగవాడు. తండ్రి గోనెల సమ్మయ్య మరణానంతరం వారసత్వంగా సారంగపాణి తల్లిని గద్దెపైకి తీసుకొస్తున్నాడు. అగ్రపంహాడ్‌లోనే సమ్మక్క-సారలమ్మ జన్మస్థలంగా పూర్వీకులు చెబుతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే సమ్మక్క-సారలమ్మ  వన దేవత లను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరిలివస్తారు.

  •  సమ్మక్క పూజారి గోనెల సారంగపాణి


logo
>>>>>>