బుధవారం 08 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 05, 2020 , 04:15:56

వనదేవతలను దర్శించుకున్న ‘పెద్ది’ దంపతులు

వనదేవతలను దర్శించుకున్న ‘పెద్ది’ దంపతులు

నర్సంపేట, నమస్తేతెలంగాణ/ములుగురూర ల్‌:  నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆయన సతీమణి జెడ్పీఫ్లోర్‌ లీడర్‌ పెద్ది స్వప్నతో కలిసి మే డారం తరలివెళ్లారు. మంగళవారం మండల కేం ద్రంలోని బస్టాండ్‌ నుంచి సాధారణ ప్రయాణికులుగా ఆర్టీసీ బస్సులో జాతరకు వెళ్లారు. తొలుత గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లించకున్నారు. అనంతరం మేడారం చేరుకుని సమ్మక్క-సారలమ్మను దర్శించుకుని, బంగారం సమర్పించుకున్నారు. మేడారానికి వెళ్లే ముందు నర్సంపేట బస్టాండ్‌లో ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో ప్ర యాణం సురక్షితమని అన్నారు. 


తల్లుల దీవెనలతో రాష్ట్రం సుభిక్షం

మేడారం బృందం, నమస్తే తెలంగాణ : సమ్మ క్క, సాలరమ్మ తల్లుల దీవెనలు మెండుగా ఉ న్నందునే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మేడారంలో తల్లులను దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ కోటిన్నర పైచిలుకు భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేయడంతోపాటు ప్రభు త్వం శాశ్వత అభివృద్ధి పనులను చేప ట్టిందన్నా రు. తెలంగాణ ప్రజలకు వనదేవతల దీవెనలు ఉండాలని కోరుకున్నట్లు పెద్ది తెలిపారు. 


logo