శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 03, 2020 , 03:24:27

కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ బదిలీ

కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ బదిలీ
  • నల్గొండ జిల్లాకు పోస్టింగ్‌

జిల్లా కలెక్టర్‌గా రాజీవ్‌ గాంధీ హనుమంతు

అర్బన్‌ కలెక్టరేట్‌: వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ నల్గొండకు బదిలీ అయ్యారు. ఈమేర కు ఆదివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కుమ్రంభీం జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజీవ్‌గాంధీ హానుమంతు జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రశా ంత్‌ జీవన్‌ పాటిల్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. జిల్లాల విభజన సందర్భంగా కుమ్రంభీం జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి కాట బదిలీ కాగా ఆమె స్థానంలో ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కాగా జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌ కుమ్రంభీం జిల్లా నుంచి రాగా, ప్రస్తుతం జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్‌ ఇచ్చిన రాజీవ్‌గాంధీ హనుమంతు కూడా అదే జిల్లా నుంచి వస్తుండటం విశేషం. కాగా నల్గొండ జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వె ళ్తున్న ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ జిల్లాలో తనకంటూ ప్రత్యేక గుర్తిం పు తెచ్చుకున్నారు. 


logo