మంగళవారం 07 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 02, 2020 , 03:34:10

ఊసేలేని కోచ్‌ ఫ్యాక్టరీ..

ఊసేలేని కోచ్‌ ఫ్యాక్టరీ..
  • బయ్యారం ఉక్కు పరిశ్రమపై నిర్లక్ష్యం
  • ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మిశ్రమ స్పందన
  • కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను విస్మరించిన కేంద్ర ప్రభుత్వం

పార్లమెంటులో శుక్రవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై మిశ్ర మ స్పందన వెలువడుతోంది. దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు కోరుతున్న కోచ్‌ ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయ్యారం ఉక్కు ఫ్యా క్టరీపై స్పందన లేదని, ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు భారీ పరిశ్రమల ఏర్పాటుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వెలువడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తమవుతోంది. బడా పారిశ్రామికవేత్తలకు రాయితీలు క ల్పిస్తున్న కేంద్రం ఆదాయపు పన్ను పరిమితిని తగ్గించడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్‌రంగంలోని చిరుద్యోగులపై పన్నుల భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పేదలు, మధ్యతరగతి వర్గాలను నిరాశపర్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

-అర్బన్‌ కలెక్టరేట్‌/రెడ్డికాలనీ/మట్టెవాడ


ప్రజామోద బడ్జెట్‌

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రశంసనీయం. వ్యవసాయ రంగానికి రూ 2.83 లక్షల కోట్లు కేటాయించడం ద్వారా రైతుల ఆదాయం రెట్టింపవుతుంది. విద్యకు రూ.99,300 కోట్లు కేటాయించి అన్ని వర్గాలను ఆ దుకునే ప్రయత్నం చేశారు. 

త్రిపురనేని గోపిచంద్‌, సీఏ 


వేతన జీవులకు  ఊరట

బడ్జెట్‌ వేతన జీవులకు కొంత ఊరట కలిగించింది. ఆదాయపు పన్ను విషయంలో స్లాబ్‌రేట్‌ తగ్గించినప్పటికీ 80సీ కింద ఉన్న రిబెటును తీసివేయడం వలన 15 లక్షలపైన ఉన్న వేతన జీవులకు పెద్దగా ప్రయోజనంలేదు. మధ్యతరగతి ఉద్యోగులకు మాత్రమే ఈ పన్నురేట్లు చాలా ప్ర యోజనకరంగా ఉంది. 


ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి నిధులు

కేంద్ర బడ్జెట్‌ సాధారణ ప్రజలకు మేలు చేస్తుంది.  ఈసారి ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యమిచ్చా రు. రవాణారంగానికి రూ.లక్షా 70 వేల కోట్లు కేటాయించడం ద్వారా దేశంలోరహదారుల విస్తరణ పెరుగుతుంది. 

 లోయ ఓంప్రకాశ్‌ (సీఏ), చైర్మన్‌ ఐసీఏఐ, వరంగల్‌


కాళేశ్వరానికి మొండిచేయి

కాళ్వేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవడం శోచనీయం. ప్రపంచంలోనే గొప్పదైన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కనీ సం ప్రస్తావించకపోవడం బాధాకరం. వరంగల్‌ జిల్లాలో టెక్స్‌టైల్‌ పార్కుకు కూ డా నిధులు కేటాయించలేదు. కేంద్ర బడ్జెట్‌ తెలంగాణకు నిరాశే మిగిల్చింది. 


logo