గురువారం 02 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 02, 2020 , 03:26:11

మీ నగరం ఎలా ఉంది..?

మీ నగరం ఎలా ఉంది..?

మీ నగరం ఎలా ఉంది.. నగరంలో విద్యా, వైద్యం, మున్సిపల్‌ సేవలు ఎలా అందుతున్నాయన్న అంశాలపై కేంద్ర గృహ, పట్టణాభివృద్ధ్ది శాఖ స్మార్ట్‌ సిటీ కాంటెస్ట్‌ నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ పమేలా సత్పతి అన్నారు. శనివారం కార్పొరేషన్‌ కౌన్సిల్‌ హాల్‌లో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమె మాట్లాడుతూ దేశంలోని స్మార్‌సిటీలుగా ఎంపికైన వంద నగరాల్లో రెండు కేటగిరిల్లో సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ ద్వారా పోటీ నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌, మున్సిపల్‌ ఫర్‌ఫార్మెన్స్‌ అంశాల్లో ఆన్‌లైన్‌ ద్వారా ప్రజలు నగరంపై 24 ప్రశ్నలకు అభిప్రాయాలు తెలుపాలన్నారు.ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ల ద్వారా తమ నగరంపై ఓటింగ్‌ చేసే అవకాశం ఉందన్నారు. స్మార్ట్‌సిటీ మిషన్‌ తొలిసారిగా ‘రేట్‌ యువర్‌ సిటీ’ కాంటెస్ట్‌ నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ ద్వారానగరంపై అభిప్రాయాలు తెలుపాలన్నారు. నగరానికి మంచి ర్యాంకింగ్‌ తీసుకొచ్చేలా ప్రజలు స్మార్ట్‌ కాంటెస్ట్‌ ఓటింగ్‌లో భాగస్వామ్యం కావాలని అన్నారు.

  • 24 ప్రశ్నలతో ‘రేట్‌ యువర్‌ సిటీ’ కాంటెస్ట్‌
  • ‘గ్రేటర్‌' కమిషనర్‌ పమేలా సత్పతి వెల్లడి
  • ఫిబ్రవరి 29 వరకు గడువు
  • సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ ద్వారా ర్యాంకింగ్‌
  • జీవన ప్రమాణాలపై ప్రజల నుంచి అభిప్రాయసేకరణ సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ ద్వారా ర్యాంకింగ్‌

సిటీజన్‌ ఫీడ్‌ బ్యాక్‌తో ర్యాంకింగ్‌

స్మార్ట్‌సిటీ మిషన్‌ నిర్వహిస్తున్న రేట్‌ యువర్‌ సిటీ కాంటెస్ట్‌లో సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ ద్వారా ర్యాంకింగ్‌  ఇస్తారని కమిషనర్‌ తెలిపారు. మున్సిపల్‌ ఫర్‌ఫార్మెన్స్‌, ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌-2019 అంశాల్లో  సిటీజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోనున్నారన్నారు. https://eol2019. org/ citizen feedback  వెబ్‌సైట్‌ ద్వారా నగర వాసులు  నగరంపై తమ అభిప్రాయాలను తెలియచేయాలని సూచించారు. మెరుగైన ర్యాంకు వస్తే స్మార్ట్‌సిటీ మిషన్‌ ద్వారా అదనపు నిధులు వస్తాయని ఆమె చెప్పారు. దేశంలోని 100 స్మార్ట్‌ సిటీ నగరాల మధ్య జరుగుతున్న పోటీల్లో ప్రజలు తమ నగరంపై సదాభిప్రాయంతో ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వాలన్నారు. రేట్‌ యువర్‌ సిటీ కాంటెస్ట్‌లో మూడు ప్రధాన అంశాలు అన్నారు. నగరంలో మెరుగైన జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయన్నది ప్రధాన అంశం. వైబ్‌సైట్‌లో లింక్‌ అయితే 24 ప్రశ్నలు వస్తాయని దానిపై ప్రజలు అభిప్రాయాలు తెలుపాలని తెలిపారు.  విద్యా, వైద్యం, మురుగునీటి నిర్వహణ, నగరంలో మహిళలకు  రక్షణ,నివాసానికి యోగ్యమైన నగరమా అనే ప్రశ్నలు ఉంటాయన్నారు. ఎకనామిక్స్‌ ఎబిలిటీస్‌ అంశంలో నగరం అభివృద్ది ఎలా ఉంది, అసమానతలు ఉన్నాయా అనే అంశాలు ఉంటాయని, సస్టేనేబిలిటీ ( స్థిరమైన) అంశంలో రిక్రియేషన్‌, ఖాళీ స్థలాలు, సిటిజన్‌ ప్రెండ్లీగా ఉందా? లేదా అనే అంశాలు ఉంటాయన్నారు. 24 ప్రశ్నలకు నగరం ప్రతీష్టను పెంచేలా ప్రజలు స్పందించాలని అన్నారు. ప్రజల అభిప్రాయాల మేరకు ర్యాంకింగ్‌ నిర్వహిస్తారని అన్నారు. ప్రస్తుతం  ఈజ్‌ ఆఫ్‌ లీవింగ్‌, మున్సిపల్‌ ఫర్‌ఫార్మెన్స్‌ విభాగాలలో మన నగరం మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. మెరుగైన ర్యాంకింగ్‌ సాధిస్తే  నగరానికి రూ. 10 లక్షల గ్రాంట్‌ వస్తుందని ఆమె అన్నారు.


29 వరకు గడువు

ఫిబ్రవరి 29 వరకు సిటీజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ ద్వారా ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని కమిషనర్‌ పమేలా సత్పతి అన్నారు. నెల రోజుల అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని ఓటింగ్‌లో భాగస్వామ్యులు కావాలన్నారు. సామాజిక మాధ్యమాలు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఆన్‌లైన్‌ ఫోన్‌లో క్యూర్‌ కోడ్‌ ద్వారా తమ అభిప్రాయాలు తెలియచేయవచ్చని వివరించారు.  స్మార్ట్‌సిటీ ప్రతినిధి ఆనంద్‌ ఓలోటి మా ట్లాడుతూ  2016లో  స్మార్‌సిటీ  ప్రారంభమైందని, రూ. 2253 కోట్లతో 84 ప్రాజెక్ట్‌లకు అంచనాలు రూపొందించామని చెప్పారు. ప్రస్తుతం రూ. 1700 కోట్లతో 64 ప్రాజెక్ట్‌లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు.  ఎస్‌ఈ భాస్కర్‌రెడ్డి, ఎంహెచ్‌వో డాక్టర్‌ రాజారెడ్డి, ఐటీ మేనేజర్‌  రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>