మంగళవారం 31 మార్చి 2020
Warangal-city - Feb 01, 2020 , 03:43:10

వీడలేమంటు..వీడ్కోలంటు..

వీడలేమంటు..వీడ్కోలంటు..

వరంగల్‌,నమస్తేతెలంగాణ: బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగ విరమణ సందడి కనిపించింది. కేంద్ర ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్‌లో వీఆర్‌ఎస్‌ ప్రకటించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 288 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌లో పని చేస్తున్న 532 మంది ఉద్యోగుల్లో 288 మంది వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. వీఆర్‌ఎస్‌కు దరఖాస్తులు చేసుకున్న ఉద్యోగుల పనికాలం జనవరి 31తో ముగిసింది. దీంతో అన్ని జిల్లా కేంద్రాలలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయాల్లో  ఉద్యోగ విరమణ సందడి నెలకొంది. దశాబ్ధాల కాలంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థతో ఉన్న అనుబంధం తెగిపోతుండటంతో ఉద్యోగులు భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఉద్యోగులు కార్యాలయం అంతా కలియతిరిగారు.  

ఒకే రోజు 288 మంది 

ఒకే రోజు 288 మంది ఉద్యోగులు పదవి విరమణ చేయడం బీఎస్‌ఎన్‌ఎల్‌ చరిత్రలో మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు.  బీఎస్‌ఎన్‌ఎల్‌ అన్ని విభాగాల నుంచి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విరమణ పొందారు. వివిధ జిల్లా కేంద్రాల్లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు విరమణ పొందారు.  ప్రతి బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో  విరమణ కార్యక్రమాలు నిర్వహించారు.  

పీజీఎం నరేందర్‌కు ఆత్మీయ వీడ్కోలు

 ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రిన్సిపల్‌ జనరల్‌ మేనేజర్‌ కందగట్ల నరేందర్‌కు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. పీజీఎం కార్యాలయంలో 58 మంది వీఆర్‌ఎస్‌ ద్వారా పదవి విరమణ తీసుకున్నారు. పీజీఎం నరేందర్‌ సైతం వీఆర్‌ఎస్‌ తీసుకోవడంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో ఆయనను ఘనంగా సన్మానించారు. మొదట ఉద్యోగ విరమణ తీసుకుంటున్న 57 మందిని పీజీఎం ఘనంగా సన్మానించారు. శాలువాలు కప్పి,మెమోంటోలు అందజేశారు.  అనంతరం పీజీఎం నరేందర్‌ను ఉద్యోగుల ంతా ఘనంగా సన్మానించారు.  


logo
>>>>>>