శనివారం 04 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 31, 2020 , 03:23:29

స్వరాష్ట్రంలోనే మెరుగైన వైద్యసేవలు

స్వరాష్ట్రంలోనే మెరుగైన వైద్యసేవలు

వరంగల్ చౌరస్తా, జనవరి 30: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైన వరంగల్ ఎం జీఎం దవాఖాన అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. గురువారం వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్‌తో కలిసి ఎంజీఎంను సందర్శించారు. ఈసందర్భంగా ఆ యన మాట్లాడుతూ రానున్న రోజుల్లో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంజీఎంను కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని అన్నారు. ఎంపీ పసునూరి దయాకర్ ప్రత్యేక చొరవతో గేయిల్ కంపెనీ ప్రతినిధులు రూ.3 కో ట్ల నిధులతో 47 యంత్ర పరికరాలను దవాఖానకు అందించడానికి అంగీకరిం చినట్లు తెలిపారు. కార్యక్రమంలో కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఎంజీఎం ఆసుప త్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, సివిల్ సర్జన్ ఆర్‌ఎంవో డాక్టర్ హరీశ్ రాజ్, ఆర్‌ఎంవోలు వెంకటరమణ, సాంబరాజు, ఆర్థ్ధోపెడిక్ విభాగం అధికారి వెం కటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


logo