గురువారం 02 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 31, 2020 , 03:15:20

సమ్మక్కకు పుట్టింటి సారె

సమ్మక్కకు పుట్టింటి సారె

తాడ్వాయి, జనవరి 30: సమ్మక్క పుట్టిన ఊరు బయ్యక్కపేట చందా వంశీయులు తల్లికు గురువారం చీరెను సమర్పించారు. బయ్యక్కపేటలోని సమ్మక్క గుడిలో చందా వంశీయు లు తలపతులు పర్మయ్య, రఘుపతిరావు, క్రిష్ణమూర్తి, గణేశ్, రవి, వెంకటేశ్వర్లు, నాగభూషణం, సోమేశ్వర్‌రావు, వెంకటేశ్వర్లు, బతక్కయ్య, కళ్యాణ్‌కుమార్ పూజారుల సంఘం ప్రధా న కార్యదర్శి చందా గోపాల్‌రావులతో కలిసి పుట్టింటి చీరెను సమ్మక్క దేవతకు సమర్పించారు. పుట్టింటి చీరెను తీసుకుని తలపతులు అయిన చందా వంశీయులు డోలివాయిద్యాల మధ్య మేడారంలోని తల్లి గద్దె వద్దకు చేరుకుని ప్ర త్యేక పూజలు నిర్వహించారు. పుట్టింటి నుంచి తల్లికి చెల్లించాల్సిన చీరె, ఒడిబియ్యం, పసుపు, కుంకుమను చెల్లించి ప్రత్యేక పూ జలు నిర్వహించారు. కొన్ని దశాబ్దాలుగా తల్లికి పుట్టింటి చీరెను సమర్పించడం ఆనవాయతీగా వస్తున్నది. గురువారం తల్లుల గద్దెల వద్ద చందా వంశీయులు పూజలు నిర్వహించిన అనంతరం సమ్మక్క దేవత గుడిలో పూజలు జరిపించారు.logo