గురువారం 02 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 31, 2020 , 03:11:31

హక్కులను వినియోగించుకోవాలి

హక్కులను వినియోగించుకోవాలి

సిద్ధార్థనగర్, జనవరి30: దళితులు తమకున్న హక్కులను వినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కాజీపేట దర్గాలోని గాంధీనగర్‌లో గురువారం పౌరహక్కుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకుముందు గాంధీ వర్ధంతి సందర్భంగా కాలనీలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళితుల హక్కులపై వారికి అవగాహన లేక వినియోగించుకోవడం లేదని, హక్కులను వినియోగించుకుని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. వారి హక్కులను కాపాడాలనే రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పడ్డాక ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి, చైర్మన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను నియమించారని అన్నారు. కాలనీలో అంబేద్కర్ కమ్యునిటీ హాల్ నిర్మాణానికి, ఎస్సీల సంక్షేమం కోసం డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం కృషి చేస్తానని అన్నారు. ప్రతి నెల 30న వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పౌరహక్కుల దినోత్సవంను నిర్వహిస్తామని తెలిపారు. 


అక్రమ కట్టడాలను అరికట్టాలి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటుందని దీనికి అధికారులు స్పందించి బంగారు తెలంగాణకు కృషి చేయాలని వినయ్‌భాస్కర్ కోరారు. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ, కాజీపేటలోని సోమిడిలో అక్రమ నిర్మాణాలు వెలిశాయని, వాటిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకారెడ్డి, ఏసీపీలు రవీందర్, రవీంద్రకుమార్, కాజీపేట ఎమ్మార్వో నాగేశ్వరరావు, స్థానిక కార్పొరేటర్లు అబుబక్కర్, అరుణ, కుడా అడ్వైజర్ మెంబర్లు బొర్ర ఐలయ్య, శివశంకర్, సీఐ నరేందర్, ఎస్సై అశోక్, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 


logo