ఆదివారం 29 మార్చి 2020
Warangal-city - Jan 30, 2020 , 03:34:44

మెగా జాబ్‌ మేళాకు విశేష స్పందన

మెగా జాబ్‌ మేళాకు విశేష స్పందన

వరంగల్‌,నమస్తేతెలంగాణ: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, ఎన్‌యుఎల్‌ఎం సంయుక్తంగా నిర్వహించిన మెగా జాబ్‌ మేళాకు విశేష స్పందన వచ్చింది. బుధవారం ఎల్‌బీ కళాశాలలో ఏర్పాటు చేసిన జాబ్‌ మేళాకు వేలాదిగా నిరుద్యోగ యువతీయువకులు తరలివచ్చారు. వారం రోజులుగా జాబ్‌ మేళాకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపట్టగా 8,393 మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఉదయం  నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన జాబ్‌ మేళాను గ్రేటర్‌ కమిషనర్‌ పమేలా సత్పతి ప్రారంభించారు. ఈ సందర్భగంగా ఆమె మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు జాబ్‌ మేళా ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. ఉద్యోగం ప్రతి ఒక్కరికీ అవసరం అన్నారు. జాబ్‌ మేళా ద్వారా కనిష్టంగా రూ.10 వేల నుంచి రూ.18 వేలు సంపాదించే అవకాశాలు ఉన్నాయని అన్నారు.


 415 మందికి ఉద్యోగాలు

జాబ్‌ మేళాలో 37 కంపెనీలు పాల్గొనగా.. 415 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కాయి. 8,393 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా 3,259 మంది ఇంటర్యూలకు ఎంపికయ్యారు. ఇందు లో 2,957 మంది ఇంటర్వ్యూకు హాజరయ్యారు. వీరిలో 415 మందికి ఉద్యోగాలు వచ్చాయని మెప్మా పీడీ కృష్ణవేణి తెలిపారు. ఈ జాబ్‌మేళాలో మెప్మా టౌన్‌ ప్రాజెక్ట్‌ అధికారి విజయలక్ష్మి, మెప్మా ఎస్‌ఎంసీ కృష్ణచైతన్య, పద్మ, రష్మి, సూర్యనారాయణ శాస్త్రి, బల్దియా సూపరింటెండెంట్‌ ప్రసునారాణి, షహజాదీ బేగం, డీసీఎం రజిత రాణి, ఏడీఎంసీ సతీశ్‌, వెంకట్‌, టీఎంసీ రమేశ్‌, సీవోలు, ఆర్పీలు పాల్గొన్నారు.


logo