బుధవారం 01 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 29, 2020 , 04:17:54

ఘనంగా ఏకశిల స్కూళ్ల వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా ఏకశిల స్కూళ్ల వార్షికోత్సవ వేడుకలు

 హసన్‌పర్తి, జనవరి 28 :  ఏకశిల గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం పెంబర్తి క్రాసురోడ్డులోని ఏకశిల టెక్నో స్కూల్‌లో ఘనంగా జరిగాయి. జబర్ధస్త్‌ బుల్లెట్‌ భాస్కర్‌ టీం సభ్యులు నరేశ్‌, ఉదయ్‌  చేసిన స్కిట్స్‌ ఆహుతులను కడుపుబ్బ నవ్వించాయి. బాలీవుడ్‌ హీరో రాణాప్రతాప్‌, సినీ హీరోలు సప్తగిరి, సంజోష్‌హరితో పాటు డైరెక్టర్‌ ఈశ్వర్‌రెడ్డి, ప్రొడ్యూసర్స్‌ జీవీఎన్‌ రెడ్డి, నరేంద్ర, సుమన్‌ప్రసాద్‌  వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.    ఏకశిల విద్యా సంస్థల చైర్మన్‌ గౌరు తిరుపతిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆర్‌జేడీ లింగయ్య ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాటాలుతూ  ప్రతి విద్యార్థి ఇష్టపడి చదవాలని, ప్రతి నిమిషం జ్ఞాన సముపార్జన కోసమే సమయాన్ని కేటాయించాలన్నారు. కాలం చాలా విలువైందని దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.   దేశాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. సమాజం సక్రమమైన రీతిలో క్రమశిక్షణతో ఉండాలంటే అది ఉపాధ్యాయుల వల్లే సాధ్యమవుతుందన్నారు. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులు గర్వపడేలా ఎదగాలన్నారు. విద్యార్థులు ఎటువంటి చెడు ప్రభావాలకు లొంగకుండా దైవభక్తి, దేశభక్తితో ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని ఉపదేశించారు. విద్యార్థులు ఉత్తమ ప్రతిభావంతులు కావడానికి ఏకశిల విద్యా సంస్థలు పాటించే ప్రమాణాలను కొనియాడారు. 


అనంతరం సినీ హీరో సప్తగిరి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తన జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని లక్ష్య సాధనవైపు క్రమశిక్షనతో అడుగులు వేస్తే గమ్యాన్ని చేరుకోవాలని దిశానిర్దేశం చేశారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమన్నారు. ఏకశిల విద్యా సంస్థల చైర్మన్‌ గౌరు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ఏకశిల విద్యా సంస్థలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందంతో అద్బుతమైన సౌకర్యాలు కల్పిస్తూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులను అత్యుత్తమ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో యాజమాన్యం అహర్నిషలు కృషి చేస్తుందన్నారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందిస్తూ వారిలో నిగూడమైన నైపుణ్యాలను వెలికితీయడానికి ఉపాధ్యాయ బృందం కృషి చేస్తుందన్నారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని, ఆశలను, ఆశయాలను నెరవేర్చడంలో ఏకశిల యాజమాన్యం వెనకడుగు వేయబోదని స్పష్టం చేశారు. ప్రతి విద్యా సంవత్సరం పదవ తరగతిలో 10జీపీఏ సాధించిన విద్యార్థులకు ఏకశిల జూనియర్‌ కళాశాలల్లో ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించారు. అనంతరం విద్యార్థులు నిర్వహంచిన సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు, నాటకాలతో సభాప్రాంగణం మారుమ్రోగింది. అత్యుత్తమ ప్రతిభకనబర్చిన విద్యార్థులకు, ఏకశలి విద్యా సంస్థలో పనిచేస్తున్న అధ్యాపక సిబ్బందితో పాటు విద్యా సంస్థ సాధించిన విజయాలను అభినందిస్తూ ఆర్‌జేడీ లింగయ్య చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు గౌరు రాజిరెడ్డి, బి.కొండల్‌రెడ్డి, యం.జితెందర్‌రెడ్డి, నాగారం మాజీ సర్పంచ్‌ పాండురంగం, వైస్‌ ప్రిన్సిపాల్స్‌ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. 


logo
>>>>>>