శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 29, 2020 , 04:16:57

ఖాళీగా డిప్యూటీ కమిషనర్‌ పోస్టు

ఖాళీగా డిప్యూటీ కమిషనర్‌ పోస్టు

కాజీపేట, జనవరి 28 :  పట్టణంలోని గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌  సర్కిల్‌-2 కార్యాలయంలో గతకొం త కాలంగా  డిఫ్యూటీ కమిషనర్‌ (డీసీ) పోస్ట్‌ ఖాళీగా ఉండడంతో పట్టణంతో పాటుగా విలీన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు  ఎదుర్కొంటున్నారు. గతంలో విలీన గ్రామాలను గ్రేటర్‌ కార్పొరేషన్‌లో కలుపడంతో కార్పొరేషన్‌ పరిధి పెరిగింది.  విలీన గ్రామాల ప్రజల  సమస్యలను పరిష్కరించేందుకు మినీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆవరణలో   సర్కిల్‌-2ను అధికారులు ఏర్పాటు చేశారు.  కార్యాలయంలో పూర్తి స్థాయిలో డీసీ లేకపోవడంతో పాలన అంతంత మాత్రంగా జరుగుతుంది. గతంలో డీసీగా పనిచేసిన బ్రహ్మయ్య గత ఏ డాది ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి నుంచి ఆ పోస్ట్‌ ఖాళీగానే  ఉంది. గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌లో అదనపు డీసీగా విధులు నిర్వర్తిస్తున్న నాగేశ్వర్‌రావును కాజీపేట  సర్కిల్‌ -2 కార్యాలయానికి ఇన్‌చార్జి డీసీగా నియమించారు. ప్రసుతం అదనపు డీసీ నాగేశ్వర్‌రావుకు ప్రభుత్వం, మున్షిపల్‌ అధికారులు  ఇటీవల త్వరలో జరుగనున్న మున్షిపల్‌ ఎన్నికల దృష్యా ఇల్లంద మున్షిపల్‌ కార్పోరేషన్‌కు  కమీషనర్‌గా మరో అదనపు బాధ్యతలు అప్పగించారు. నాగేశ్వర్‌రావుకు ఇల్లందు  కార్పొరేషన్‌కు కమిషనర్‌గా బాధ్యతలు పెరుగడంతో ఆయన కాజీపేట సర్కిల్‌-2లో సకాలంలో విధులను నిర్వర్తించలేకపోతున్నారు. గత కొంత కాలంగా ఆయన సెలవుపై వెళ్లారు.  కాజీపేట సర్కిల్‌-2లో పూర్తి స్థాయి అధికారి లేకపోవడంతో పట్టణంతో పాటు, విలీన గ్రామాల ప్రజలు మరణ, జనన ధ్రువీకరణ పత్రాలను సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు.  ప్రభుత్వ యత్రాంగం,  అధికారులు, స్పందించి  ఖాళీగా ఉ న్న డీటీ పోస్ట్‌ను భర్తీ చేసి ప్రజలు కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. 


logo