శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 29, 2020 , 04:08:58

డ్రంకన్‌ డ్రైవ్‌లో ఐదుగురికి జైలుశిక్ష

డ్రంకన్‌ డ్రైవ్‌లో ఐదుగురికి జైలుశిక్ష

మట్టెవాడ, జనవరి 28: వరంగల్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మద్యం తాగి వాహనాలను నడిపిన ఐదుగురికి జైలుశిక్ష పడినట్లు వరంగల్‌ ట్రాఫిక్‌ సీఐ స్వామి తెలిపారు. ఈ  నెల 23న సంగెం మండలం రామచంద్రపురానికి చెందిన గొడుగు ప్రభాకర్‌, 24న కొత్తగూడ మండలం పోగులపల్లికి చెందిన సిరబోయిన సంతోష్‌, 25న ఏనుమాములకు చెందిన తెట్టె జనార్ధన్‌, సుందరయ్యనగర్‌కు చెందిన మహ్మద్‌ అలీం, కమాన్‌పూర్‌ మండలం రజ్వీకాలనికి చెందిన మహ్మద్‌ యూసుఫ్‌లు మద్యం తాగి వివిధ వాహనాలు నడుపుతున్న క్రమంలో ఎస్సైలు పట్టుకుని కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.  ఈ క్రమంలో వారిని వరంగల్‌ రెండోతరగతి మెజిస్ట్రేట్‌ వెంకటేశం ఎదుట హాజరుపరుచడంతో  ఆయన వారికి  రెండు రోజుల చొప్పున శిక్ష విధించడంతో వారిని వరంగల్‌ సెంట్రల్‌జైలుకు తరలించినట్లు  చెప్పారు.  మరో ఆరుగురికి సంబంధించి రూ.11,800 జరిమాన విధించినట్లు సిఐ స్వామి  వివరించారు. 


logo