శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 28, 2020 , 05:40:32

ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా

ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా

కరీమాబాద్‌, జనవరి 27: ఆలయ అభివృద్ధ్దికి తనవంతు కృషి చేస్తానని వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. కరీమాబాద్‌లోని బొమ్మలగుడిలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ శ్రీ మేరుయంత్ర స్థాపనను పురస్కరించుకుని సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొమ్మలగుడిలో ఏర్పాటు చేస్తున్న ధ్వజస్తంభ ఏర్పాటుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తానన్నారు. ప్రజలు సమష్టిగా బొమ్మలగుడిలో ధ్వజస్తంభం ఏర్పాటు చేసుకోవడం హర్షణీయమన్నారు.   ఆలయాల అభివృద్ధ్దికి తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. ఆలయ కమిటీ మాజీ చైర్మన్‌ కొమ్మిని రాజేందర్‌ మాట్లాడుతూ ధ్వజస్తంభ ప్రతిష్ఠ శ్రీ మేరు యంత్ర స్థాపనను పురస్కరించుకుని 3 రోజల పాటు బొమ్మలగుడిలో ప్రత్యేక పూజలు చేపట్టామన్నారు. దాతలు, భక్తుల సహాయ సహకారంతో ధ్వజస్తంభ ప్రతిష్ఠ.. శ్రీ మేరు యంత్ర స్థాపన చేస్తున్నామన్నారు. ధ్వజస్థంభ ప్రతిష్ఠకు విరాళాలు అందజేసిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మేడిది రజిత, మాజీ కార్పొరేటర్‌ నాగపూరి కల్పన, ఆలయ ప్రధాన అర్చకులు శివపురం రామలింగ ఆరాధ్య, వొగిలిశెట్టి అనిల్‌కుమార్‌, నాగపూరి సంజయ్‌బాబు, వెలిదె శివమూ ర్తి, గోనె రాంప్రసాద్‌, వంచనగిరి సమ్మ య్య, మేడిది మధుసూదన్‌, పౌడాల సంపత్‌, కొమ్మి ని సురేశ్‌, కోదాటి శ్యాం, నాగపూరి అశోక్‌, పుట్ట భోగేశ్వర్‌, పొగాకు సం దీప్‌, పూదరి అజయ్‌, ఎరబాక సతీశ్‌,  ప్రవీణ్‌,  రవి,  రమేశ్‌,  రాజశేఖర్‌,  సతీశ్‌,  సంజీవ్‌ ,  మురళీ పాల్గొన్నారు. 

ప్రత్యేక పూజలు...

ధ్వజస్తంభ ఏర్పాటును పురస్కరించుకుని సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 8 గంటలకు గణపతి పూజ, పున్యాహవచనము, యాగ మండపపూజ, యాగశాల ప్రవేశము, వర్దనీ కలశస్థాపన, ద్వారతోరణం, స్తంభపూజలు, వాస్తు పర్యగ్నీకరణము, యోగిని, క్షేత్రపాలన, నవగ్రహ ఏకలింగ, సర్వతో భద్ర మండల ఆవాహనము, ప్రధాన కలశస్థాపన, కుండ సంస్కారము, అగ్ని ప్రతిష్టాపన, మూలమంత్ర హవనములు  జలాదివాసము, హారతి, మంత్రపుష్పము నిర్వహించారు.  

జ్యోతిర్లింగాల నుంచి నీరు..

12జ్యోతిర్లింగాల పుణ్యక్షేత్రాల నుంచి తీసుకువచ్చిన నదుల నీరుతో ధ్వజస్తంభానికి జలాదివాసము చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మానస సరోవరం, అమర్‌నాథ్‌, చార్‌దామ్‌తో పాటు భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి నీరును తీసుకువచ్చి ధ్వజస్తంభానికి జలాదివాసము చేసినట్లు వంచనగిరి సమ్మయ్య తెలిపారు. 

కరీమాబాద్‌లో పండుగ వాతావరణం..

బొమ్మలగుడిలో చేపట్టిన ధ్వజస్తంభ ప్రతిష్ఠ.. శ్రీ మేరు యంత్ర స్థాపనలో భాగంగా ఉదయం నుంచి నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలతో  కరీమాబాద్‌ ప్రాంతంలో పండుగ  నెలకొంది. ధ్వజస్తంభానికి జలాదివాసం సందర్భంగా ప్రజలు తమ ఇళ్ల నుంచి బిందెలతో పాలు, పెరుగు, నీళ్లు  తీసుకువచ్చి  పోశారు. 


logo