శనివారం 04 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 28, 2020 , 02:19:59

వన దేవతలకు నీరాజనం

వన దేవతలకు నీరాజనం
  • మేడారానికి పోటెత్తిన భక్తులు
  • భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లింపు

తాడ్వాయి/ఏటూరునాగారం/వాజేడు, జనవరి 26 : వనదేవతలైన సమ్మక్క-సారక్కలకు భక్తులు నీరాజనాలు పలుకుతున్నారు. గంటల తరబడి క్యూ కడుతూ అమ్మవార్ల దర్శించుకుంటున్నారు. మేడారం జాతర పరిసరాలు శివసత్తుల పూనకాలతో తన్మయత్వం చెందుతున్నాయి. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ప్రై వేట్‌, ఆర్టీసీ బస్సులలో మేడారానికి చేరుకున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలను ఆచరించిన అనంతరం వాగు ఒడ్డున గల నాగులమ్మ, జంపన్న గద్దెలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంతానం కలుగని దంపతులు జంపన్నగద్దెకు ముడుపులు కట్టారు. అక్కడి నుంచి భక్తు లు అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుని సమ్మక్క-సారక్క, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలపై పసుపు, కుంకు మ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు సమర్పించి తల్లులకు గిరిజన సంప్రదాయ పద్ధతులలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ మొక్కులకు అనుగుణంగా యాటపోతులను సమర్పించారు. అనంతరం జాతర పరిరాల్లో చెట్లకింద విడిది చేసి వంటలు చేసుకున్నారు. విందు భో జనాలు చేసి రోజంతా ఆనందంగా గడిపారు. శనివారం ఉదయం ప్రారంభమైన భక్తుల రాక ఆదివారం సాయం త్రం వరకు కూడా కొనసాగింది. ఆదివారం ఒక్క రోజే సుమారు 4లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చినట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. భక్తు లు అధిక సంఖ్యలో తరలివస్తుండడంతో రాత్రివేళలో కూడా అమ్మవార్లను దర్శించుకునేలా దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల రద్దీ దృష్ట్యా తప్పిపోయిన వారికోసం వారి బంధువులు మీడియా పాయింట్‌లో ఏర్పాటు చేసిన మైక్‌వద్దకు వచ్చి బంధువుల ఆచూకీని తెలుసుకున్నారు. భక్తులకు జేబుదొంగల బెడద తప్పలే దు. కన్నెపల్లి, జంపన్నవాగు గ్రామాల మధ్యలో ఏర్పా టు చేసిన పార్కింగ్‌ స్థలం భక్తుల వాహనాలతో నిండిపోయింది. దొంగలు తమ చేతి వాటం ప్రదర్శించడంతో బాధితులు లబోదిబోమన్నారు. గద్దెల వద్ద భక్తులు ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.


భక్తులతో నిండిపోయిన వనాలు ..

ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో జాతర పరిసరాల్లోని వనమం తా జనమయంగా మారింది. తాడ్వాయి నుంచి మేడా రం, మేడారం నుంచి పస్రా, కాల్వపల్లి, బయ్యక్కపేట, చిలుకలగుట్ట తదితర ప్రాంతాల్లోని అడవిలో చెట్టుకొకరు, పుట్టకొకరు విడిది చేశారు. రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయారు.  అడవిలో పచ్చని ప్రకృతి అందాలు భక్తిభావంతో నిండిపోయాయి. కుటుంబ సమేతంగా వచ్చి న భక్తులు అమ్మవార్ల దర్శనం అనంతరం రోజంతా ప చ్చని అడవి అందాలను తనివి తీరా ఆస్వాదిస్తున్నారు. విందు భోజనాలు చేస్తూ రోజంగా సందడి చేశారు.


భక్తులకు మెరుగైన వైద్యసేవలు..

వాజేడు : మేడారం జాతరకు వచ్చి అస్వస్థతకు గు రైన భక్తులకు భక్తులకోసం ఏర్పాటు చేసిన హెల్త్‌క్యాంప్‌ లో వైద్య సేవలు అందించారు. వైద్యాధికారి కారం నిఖిల్‌కుమార్‌ వైద్య పరీక్షలు చేసి మందులు అందించారు.


logo