ఆదివారం 24 మే 2020
Warangal-city - Jan 27, 2020 ,

నగరంలో భూప్రకంపనలు

నగరంలో భూప్రకంపనలు

వరంగల్‌ క్రైం/వరంగల్‌ చౌరస్తా: నగరంలో ఆదివారం తెల్లవారుజామున 2:39 సమయంలో భూమి కంపించడం కలకలం రేపింది. ఐదు సెకండ్లు పాటు ఇళ్లలో వస్తువులు కదలడం, తలుపులు బిగ్గరగా కొట్టకోవడం భయాందోళనకు గురిచేసింది. హన్మకొండ రాంనగర్‌, రెడ్డికాలనీ, వరంగల్‌ శివనగర్‌ ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. రాంనగర్‌కు చెందిన  ప్రత్యక్ష సాక్షి ఎం. శ్రీనివాస్‌ కథనం ప్రకారం... అమెరికాలోని వారి సంబంధీ కులతో ఫోన్‌ మాట్లాడి 2:38 నిమిషాల సమయం లో పడుకునే క్రమంలో ఒక్కసా రిగా తలుపుల నుంచి బిగ్గరగా శబ్ధం వచ్చింది. గాలి దూమారం వ స్తుందని బయటి కి చూసే క్రమంలోనే ఐదు నుంచి 8 సెకండ్లు పాటు కాళ్ల కింద భూమి కంపించింది. వెంటనే తేరుకొని డయల్‌ 100కు ఫోన్‌ చేయగానే ఫైర్‌ అధికారులు, పొలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారన్నారు. రెడ్డికాలనీ, శివనగర్‌ ప్రాంతాల్లోనూ స్వల్పం గా భూమి కంపించినట్లు చర్చించు కుంటున్నారు. కాగా ఖమ్మం, సూర్యాపేట, క రీంనగర్‌ ప్రాంతాల్లో కూడా స్వల్పం గా భూమి కంపించినుట్ల అధికారులు పేర్కొ న్నారు. 

భూ ప్రకంపనలతో భయాందోళన

వరంగల్‌ గోవిందరాజుల గుట్ట ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున 2 గంట ల 45 నిమిషాల నుంచి 2:50 నిమిషాల మధ్య కాలంలో సుమారు 5 నుండి 10 సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించిందని స్థానికులు తెలిపారు. ఇంటిలోని వ స్తువుల నుండి శబ్ధం రావడంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. ప్ర కంపనల స్థాయి తక్కువగా ఉండటంతో ఎలాంటి నష్టం కలగలేదని వారు పేర్కొ న్నారు. logo