సోమవారం 06 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 27, 2020 ,

బల్దియాలో గణతంత్ర వేడుకలు

బల్దియాలో గణతంత్ర వేడుకలు

వరంగల్‌, నమస్తేతెలంగాణ : మహా నగరపాలక సంస్థ కార్యాలయంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం  కమిషనర్‌ పమేలా సత్పతి, మేయర్‌ గుండా ప్రకాశ్‌రా వు, కార్పొరేటర్లు జాతిపిత మహాత్మగాంధీ, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అబేంద్కర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేశారు. పోలీసుల గౌరవ వందనం మధ్య కమిషనర్‌ పమేలా సత్పతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో కార్పొరేటర్లు, ఉద్యోగుల క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. బల్దియా కార్యాలయ డైరీని ఆవిష్కరించా రు. ఈసందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ స్మార్ట్‌సిటీ నిధులు రూ.2 వేల 331 కోట్లతో 81 పనులు చేపట్టామని అన్నారు. ఆయా పనులు వివిధ దశలో ఉన్నాయని, రూ.74 కోట్లతో స్మార్ట్‌రోడ్ల పను లు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. స్మార్ట్‌సిటీలో భాగంగా రూ. 23 కోట్లతో 13 జంక్షన్‌లను అభివృద్ధి చేశామని అన్నారు. మే యర్‌ గుండా ప్రకాశ్‌రావు మాట్లాడుతూ నగరాన్ని అన్ని రంగాల్లో అభి వృద్ధి చేసేందుకు ము ఖ్యమంత్రి కేసీఆర్‌, మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక దృష్టి పెడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు  వద్దిరాజు గణేశ్‌, కత్తెరశాల వేణుగోపాల్‌, శామంతుల ఉషశ్రీ, జోరిక రమేశ్‌, మరుపల్ల భాగ్యలక్ష్మి, బయ్య స్వామి, వేముల శ్రీనివాస్‌, మేడిది రజిత, మాధవీలత, బానోత్‌ కల్పన, బాలయ్య, మిర్యాల్‌కార్‌ దేవేందర్‌, యెలుగం లీలావతి, నల్లా స్వరూపారాణి, ఇన్‌చార్జి అ దనపు కమిషనర్‌ నారాయణరావు, డిప్యూటీ కమిషనర్‌ గోదుమల రాజు, ఎం హెచ్‌వో డాక్టర్‌ రాజారెడ్డి, పన్నుల అధికారి శాంతికుమార్‌, కార్యదర్శి విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

కుడా కార్యాలయంలో..

కుడా కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘ నంగా నిర్వహించారు. కమిషనర్‌, కుడా వైస్‌ చైర్‌పర్సన్‌ పమేలా సత్పతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, పీవో అజిత్‌రెడ్డి, కార్యదర్శి మురళీధర్‌రావు, ఈఈ భీమ్‌రావు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులో.. 

సిద్ధార్థనగర్‌: బాలసముద్రంలోని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులో గణతంత్ర వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, మాజీ ఎంపీ సీతారాంనాయక్‌, డిప్యూటీ మేయర్‌ ఖాజాసిరొద్దీన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. logo