మంగళవారం 31 మార్చి 2020
Warangal-city - Jan 27, 2020 ,

పేదలకు అండ సీఎం కేసీఆర్‌..

పేదలకు అండ సీఎం కేసీఆర్‌..

కాజీపేట, జనవరి 26: రాష్ట్రంలోని పేద  ప్రజలకు అన్ని విధాలా సీఎం కేసీఆర్‌ అండగా నిలుస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. కాజీపేటలో జన్యు సంబంధమైన వ్యాధితో బాధపడుతు న్న శ్రీహితకు రూ.ఐదు లక్షల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును ఆయన ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 ఏళ్లుగా  దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్న శ్రీహిత విషయాన్ని మంత్రి కేటీఆర్‌, సీఎం కేసీఆర్‌ దృష్టికి  తీసుకువెళ్లినట్లు తెలిపారు. తక్షణమే స్పందించిన సీఎం కేసీఆర్‌ శ్రీహిత కుటుంబానికి రూ. ఐదు లక్షలు మంజూరు చేశారని ఆయన గుర్తు చేశారు.  శ్రీహిత కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు నార్లగిరి రమేశ్‌, రావుల  సదానందం, మహ్మద్‌ సోని, దువ్వ కనకరాజు, సుంచు అశోక్‌, రాంచందర్‌, సామాజికవేత్త  శంకర్‌ పాల్గొన్నారు.


logo
>>>>>>