మంగళవారం 31 మార్చి 2020
Warangal-city - Jan 25, 2020 , 02:52:38

గుడి సంబురాలు అదరహో..

గుడి సంబురాలు అదరహో..
  • ప్రారంభించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
  • ఆకట్టుకున్న కళాకారుల నృత్య ప్రదర్శనలు


ఖిలావరంగల్, జనవరి 24: చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటలోని కీర్తి తోరణాల ప్రాంగణంలో శుక్రవారం రాత్రి పరంపర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గుడి సంబురాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలను వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎస్సార్  విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వివిధ కళలను, విభిన్న సంస్కృతీసంప్రదాయాలు ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా కూచిపూడి నృత్య నిరంజనం పూజ ఆకాంక్షరెడ్డి, దీపికారెడ్డి, మధు నటరాజన్ బృందాలు చేసిన నాట్య ప్రదర్శనలు అదరహో అనిపించాయి. కల్వరి పట్టు, ఉష, తరాన, కథక్, ప్లేమింగ్, జుగల్ బంది ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శివపార్వతుల కల్యాణంలో భాగంగా విద్మహే శివ, శివ, తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు, నృత్య నీరాజం వంటి నాట్య ప్రదర్శనలు  ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశా యి. భారతీయ సంస్కృతి, కళలలు విశ్వవ్యాప్తం చేయడమే ధ్యేమని ఈ సందర్భంగా దీపాకరెడ్డి, నాగి పేర్కొన్నారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లు కోటలోని కీర్తి తోరణాల ప్రాంగణాన్ని వేదికగా చేసుకొని గుడి సంబరాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కాకతీయుల చరిత్రను, కట్టడాలను ప్రపంచ వ్యాప్తంగా తెలియజేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, అన్ని విధాలుగా సంస్థకు సహకరిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళాకారులను ఘనంగా సత్కరించారు.logo
>>>>>>