సోమవారం 06 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 25, 2020 , 02:51:46

బాలికల సంరక్షణ అందరి బాధ్యత

బాలికల సంరక్షణ అందరి బాధ్యత
ఎల్కతుర్తి/కమలాపూర్: బాలికల సంరక్షణ అందరి బా ధ్యత అని కమలాపూర్ ఎంపీపీ తడక రాణి, ఎల్కతుర్తి ఎం పీపీ మేకల స్వప్న అన్నారు. శుక్రవారం జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరిం చు కుని ఎల్కతుర్తి, కమలాపూర్, ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆ ధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మా ట్లాడుతూ బాలికలపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు. స మాజ అభివృద్ధిలో బాలికల పాత్ర కీలకమైందన్నారు. లింగ వివక్షత చూపకుండా బాలికలను కాపాడుకోవాలన్నారు. ఆడ పిల్లలను పుట్ట నిద్దాం సమాజాన్ని కాపాడుదామని చెప్పారు. లింగ నిర్ధారణ పరీక్ష లు నిర్వహించడం నేరమని, ఇలా ఎవరైనా చేస్తే కఠిన చర్యలు త ప్పవని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కట్కూరి విజయ, డాక్టర్లు శ్రీనివాస్, సంయుక్త, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

ఘనంగా బాలికల దినోత్సవం

జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్ర వారం ఎ ల్కతుర్తిలో ర్యాలీ నిర్వహించారు. గ్రామ పంచాయ తీ నుంచి బ స్టాండ్ కూడలి వరకు ర్యాలీ కొనసాగింది. అలాగే కస్తూర్బా పాఠశాల లో వేడుకలను నిర్వహించారు. విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమా లు అలరించాయి. ప్రతిభకనబర్చిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారిణి నీరజ, వైస్ ఎంపీపీ తంగె నగేశ్, ఎంపీటీసీ కడారి రాజు, వెంకటేష్‌యాదవ్, ప్రిన్సిపాల్ అనితాదేవి, వైద్యులు శోభారాణి, రవితేజ పాల్గొన్నారు.

ఆడ పిల్లలను రక్షిద్దాం..

వేలేరు: ఆడ పిల్లలను రక్షిద్దామని సర్పంచ్‌ల ఫోరం మం డల అధ్యక్షుడు, వేలేరు గ్రామ సర్పంచ్ కాయిత మాధవరెడ్డి అన్నారు. మండలకేంద్రంలో శుక్రవారం జాతీ య బాలికల దినోత్సవం సందర్భంగా వైద్యసిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు గ్రామంలో డాక్టర్ జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మహిళలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆత్మైస్థెర్యంతో ముందుకుసాగాలి

ధర్మసాగర్: బాలికలు ఆత్మైస్థెర్యంతో ముందుకుసాగాలని నారాయణగిరి జెడ్పీఎస్‌ఎస్ హెచ్‌ఎం సాహెదబేగం అన్నారు. మండలంలోని నారాయణగిరి గ్రామంలో శుక్రవారం జన విజ్ఞాన వేదిక సమతా కన్వీనర్ సుమలత ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎస్‌ఎంసీ చైర్మన్ వక్కల కరుణాకర్, కోఆప్షన్ మెంబర్ భాస్కర్ పాల్గొన్నారు. పెద్దపెండ్యాల జెడ్పీఎస్‌ఎస్‌లో హెచ్‌ఎం బద్దం వెంకట్‌రెడ్డి అధ్యక్షతన  జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. ఎస్‌ఎంసీ చైర్మన్ మామిడాల కిశోర్, హెచ్ ఎం బద్దం వెంకట్‌రెడ్డి, ఉ పాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.logo