బుధవారం 01 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 25, 2020 , 02:49:32

జాతీయ ఓటరు దినోత్సవ ర్యాలీని విజయవంతం చేయాలి

జాతీయ ఓటరు దినోత్సవ ర్యాలీని విజయవంతం చేయాలి
  • పబ్లిక్‌గార్డెన్ నుంచి అంబేద్కర్ భవన్ వరకు ర్యాలీ
  • అంబేద్కర్‌భవన్ వద్ద ఓటరు నమోదు కేంద్రం
  • కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్

అర్బన్ కలెక్టరేట్, జనవరి 24 : నేటి జాతీయ ఓటర్ల దినోత్సవంలో ప్రతిఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ కోరారు. 18 ఏళ్లు నిండిన యువత ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు అయ్యేందుకు వీలుగా ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం నిర్ణయించిందన్నారు. ఈ సందర్భంగా ఓటరు నమోదుకు హన్మకొండలోని అంబేద్కర్‌భవన్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు.  ఓటరు నమోదుతో పాటు ఓటరు జాబితాలో పేరు ఉన్నదీ.. లేనిదీ చూసుకుని, ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చన్నారు. ఈ నెల 25న ఉదయం 9గంటలకు పబ్లిక్‌గార్డెన్ నుంచి అంబేద్కర్‌భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. ర్యాలీలో ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ వలంటీర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, యువతీ యువకులు, క్రీడాకారులు, కళాకారులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే యువ ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులు అందజేస్తామని ఆయన వివరించారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారన్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియలో ప్రతిభకనబర్చిన వారికి సర్టిఫికెట్లు అందిస్తారని తెలిపారు. ఉత్సాహవంతులు శనివారం ఉదయం 8.30గంటలకు పబ్లిక్‌గార్డెన్‌కు చేరుకోవాలని కలెక్టర్ కోరారు.


logo
>>>>>>