ఆదివారం 24 మే 2020
Warangal-city - Jan 23, 2020 , 02:34:21

పుర పోరు ప్రశాంతం

పుర పోరు ప్రశాంతం
  • - ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీలకు ఎన్నికలు
  • - కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్


       

వరంగల్ ప్రధాన ప్రతినిధి, నమస్తేతెలంగాణ : కట్టుదిట్టమైన భద్రత మధ్య బుధవారం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. మొత్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని జనగామ, మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, భూపాలపల్లి పురపాలక సంఘాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 200 వార్డులకు 18 వార్డుల్లో టీఆర్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవగా, మిగిలిన 182 వార్డుల్లో 878 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన విస్తృత ప్రచారంతో ఓటర్లు పోలింగ్ బూత్ ఉత్సాహంగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం భారీ పోలీస్ మధ్య బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ తరలించారు.

భూపాలపల్లిలో 63.37 శాతం పోలింగ్

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం 63.37శాతం పోలింగ్ నమోదైం ది. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 50,651 మంది ఓటర్లుండగా 31,117 ఓట్లు పో ల్ అయ్యాయి. ఉదయం 9 గంటల వరకు 12.18 శాతం, 11 గంటల వరకు 30.14 శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 46.11 శాతం, 3 గంటల వరకు 57.24 శా తం, 5 గంటల వరకు 63.37 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 31,117 మంది ఓటు హక్కును వినియోగించుకోగా ఇందులో పురుషులు 16,001, మహిళలు 15, 116 మంది ఉన్నారు. మొత్తం పురుషులు 62.50 శాతం, మహిళలు 64.33 శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జనగామలో 79.38 శాతం నమోదు

జనగామ మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లోని 60 పోలింగ్ కేంద్రాల్లో బుధవా రం 79.38 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 40,099 ఓటర్లుండగా, 31,832 మంది తమ ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. 12వ వార్డులో అత్యధికంగా 87.82 శాతం, అత్యల్పంగా 3వ వార్డులో 72.41 శాతం ఓటింగ్ నమోదైంది. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి దంపతులు, డీసీపీ శ్రీనివాసరెడ్డి, జనగామ ఆర్డీవో మధుమోహన్ తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు.

వరంగల్ రూరల్ జిల్లాలో 84.48 శాతం నమోదు

వరంగల్ రూరల్ జిల్లాలోని మూడు ము న్సిపాలిటీల్లో మొత్తం 84.48 శాతం పోలింగ్ నమోదైంది. 49,620 మంది ఓటర్లకుగా ను 41,918 ఓటు వేశారు. వీరిలో మహిళలు 21, 752, పురుషులు 20,166 మంది ఉన్నారు. నర్సంపేట పురపాలక సంఘం పరిధిలోని 24 వార్డుల్లో 84.27 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 27,713 మంది ఓటర్లకుగాను 23, 353 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలో 81.90 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 22 వార్డుల్లో 11 వార్డుల నుంచి టీఆర్ అ భ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మిగతా 11 వార్డుల్లో పోలింగ్ జరిగింది. వర్ధన్నపేట పురపాలక సంఘం పరిధిలోని 12 వా ర్డుల్లో 8,210 మంది ( 88.63 శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 6వ వా ర్డు డీసీ తండాలో 98.6శాతం పోలింగ్ నమో దు కావడం రికార్డు.

మహబూబాబాద్: నాలుగు మున్సిపాలిటీల్లో 78.11 పోలింగ్

మహబూబాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీ లు ఉన్నాయి.  మహబూబాబాద్ 78.01 శాతం, తొర్రూరులో 72.62శాతం, మరిపెడ 82.88 శాతం, డోర్నకల్ 83.20శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మహబూబాబాద్ 56115 మంది ఓటర్లు ఉండగా 43777 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. డోర్నకల్ 9490 మంది ఓటర్లు ఉండగా 7896 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరిపెడలో 11000 మంది ఓట ర్లు ఉం డగా 9117 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొర్రూరులో 17338 మంది ఓటర్లు ఉండగా 12591 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 78.11శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.  ఓటర్ల సౌకర్యార్థం నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 138 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,113 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీ య ఘటనలు జరుగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శివలింగయ్య, జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.

పరకాల మున్సిపాలిటీలోని మొత్తం 22 వార్డుల్లో 11 వార్డులను టీఆ ర్ ఏకగ్రీవం చేసుకోగా మిగిలిన 11 వార్డులకు ఎన్నికలు జరిగా యి. భూపాలపల్లిలోని 30 వార్డుల్లో ఒక వార్డును టీఆర్ మహ బూబాబాద్ 36 వార్డులకు ఒక వార్డును టీఆర్ డోర్నకల్ 15 వార్డులకు ఒక వార్డు టీఆర్ తొర్రూరులో 16 వార్డులకు రెండు వార్డులు టీఆర్ మరిపెడలో 15 వార్డులకు రెండు టీఆర్ ఏకగ్రీవం చేసుకోగా మిగిలిన వార్డులకు ఎన్నికలు జరిగాయి..logo