శనివారం 04 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 23, 2020 , 02:33:38

గ్రేటర్ ‘వృక్ష జ్ఞాపకం’

గ్రేటర్ ‘వృక్ష జ్ఞాపకం’వరంగల్, నమస్తేతెలంగాణ : ‘మీరు మొక్కలు నాటండి.. వాటిని మేము  పరిరక్షిస్తాం’ అంటూ బల్దియా కొత్త నినాదాన్ని ఎత్తుకుంది. చారిత్రక నగరంలో ‘వృక్ష జ్ఞాపకం’ (గ్రీన్ లెగసీ) ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేస్తోంది. వారసత్వ సంపదగా మొక్కను పెంచుకోండి అంటూ అధికారులు వృక్ష జ్ఞాపకాన్ని ఏ ర్పాటు చేస్తున్నారు. వడ్డేపల్లి బండ్ సమీపంలోని కేయూ బైపా స్ రోడ్డుకు వెళ్లే రహదారిలో ఉన్న సుమారు మూడు ఎకరాల ఖాళీ స్థలంలో దీనిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నా రు. వృక్ష జ్ఞాపకంలో ఒక మొక్క నాటేందుకు బల్దియా మూడు కేటగిరీలలో రేటు నిర్ణయించనుంది. ఇందుకోసం బల్దియా ప్ర త్యేక బ్యాంక్ అకౌంట్ తెరువనుంది. ఎవ్వరైనా వృక్ష జ్ఞాపకంలో మొక్కను నాటాలంటే మీసేవ ద్వారా డబ్బులు చెల్లిస్తే వృక్ష జ్ఞాపకంలో మొక్కను నాటే అవకాశం కల్పిస్తారు. నాటిన వారి పేరు న మొక్కకు బోర్డు ఏర్పాటు చేస్తారు. మొక్కను పరిరక్షించే బా ధ్యత బల్దియా తీసుకుంటుంది. గతంలో అటవీశాఖ మామునూరు ప్రాంతంలో ‘స్మృతివనం’ పేరుతో స్థలం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే స్మృతివనంలో మృతిచెందిన వారి జ్ఞాపకార్థం మొక్కలు నాటే అవకాశం ఉండేది. బల్దియా ప్రస్తు తం ఏర్పాటు చేస్తున్న వృక్ష జ్ఞాపకంలో తమ వారసత్వంగా త మ పేరుపై మొక్కను నాటే అవకాశం ఉంది. వారసత్వంగా చె ట్టును పెంచుకోవాలనే సంకల్పం కలిగిన వారికి వృక్ష జ్ఞాపకం ఎంతో ఉపయోగంగా ఉంటుంది.

మూడు కేటగిరీల్లో మొక్కలు

వృక్ష జ్ఞాపకంలో మూడు కేటగిరీల్లో మొక్కలు నాటేందుకు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. మొక్కకో రేటు నిర్ణయించనున్నారు. వృక్ష జ్ఞాపకంలో పెద్ద వృక్షాలుగా పెరిగే రావి, వేపలాంటి మొక్కలు నాటేందుకు రూ. 1,116, నిమ్మ, జామ లాంటి  పండ్ల మొక్కలు నాటితే రూ.516, పూల మొక్కలు నా టేందుకు రూ.116గా రేటు నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తు తం వడ్డేపల్లి బండ్ సమీపంలో ఏర్పాటు చేయనున్న వృక్ష జ్ఞాపకంలో సుమారు వెయ్యి మొక్కలు నాటేందుకు అవకాశం ఉన్న ట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో తొలిసారిగా వృక్షజ్ఞాపకం ఏ ర్పాటు చేయనున్న నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి తర్వాత వీటిని విస్తరించాలన్న ఆలోచనలో గ్రేటర్ అధికారులు ఉన్నట్లు సమాచారం.

పరిరక్షణ బాధ్యత బల్దియాదే

గ్రేటర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్న వృక్ష జ్ఞాపకంలో నాటిన ప్రతి మొక్కను పరిరక్షించే బాధ్యత బల్దియా తీసుకోనుం ది. తమ వారసత్వ సంపదగా వృక్ష జ్ఞాపకంలో డబ్బులు చెల్లిం చి మొక్క నాటితే దానిని సంరక్షించి పెంచి వృక్షంగా ఎదిగే వర కు బల్దియా బాధ్యత తీసుకోనుంది. పెద్ద వృక్షాల మొక్కల కో సం ప్రత్యేక స్థలం, పూలు, పండ్ల మొక్కలు పెంచేందుకు ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వడ్డేపల్లి బండ్ సమీపంలోని ఖాళీ స్థలాన్ని చ దును చేసే పనులు చకచకా సాగుతున్నాయి. చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వడ్డేపల్లి చెరువు నుం చి మొక్కల పరిరక్షణకు నీటిని వినియోగించుకునేందుకు పైప్ ఏర్పాటు చేయనున్నారు.logo