శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 23, 2020 , 02:29:17

వైద్య విద్య ప్రాథమిక స్థాయి పటిష్టతకు కృషి

వైద్య విద్య ప్రాథమిక స్థాయి పటిష్టతకు కృషి
  • - మారిన ఎంబీబీఎస్ పాఠ్యాంశాలు, ప్రశ్నాపత్రాల తీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి
  • - బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశంలో కాళోజీ హెల్త్ వీసీ కరుణాకర్రెడ్డికాలనీ, జనవరి 22: వైద్య విద్యలో ప్రాథమిక స్థాయి పటిష్టతకు బోధన సిబ్బంది కృషి చేయాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ బీ కరుణాకర్ పేర్కొన్నారు. బుధవారం హన్మకొండలోని అశోకా కాన్ఫరెన్స్ హాలో ఎంబీబీఎస్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వీసీ కరుణాకర్ మాట్లాడుతూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ విద్యాసంవత్సరం నుంచి ఎంబీబీఎస్ పాఠ్యాంశాల్లో మార్పు చేసిందన్నారు. అందుకు అనుగుణంగా ప్రశ్నాపత్రాల రూప కల్పనలో మార్పులు చోటు చేసుకుంటాయని అన్నారు. మారిన పాఠ్యాంశాలకనుగుణంగా విద్యాబోధన చేయాలని, అదేవిధంగా మోడల్ ప్రశ్నాపత్రాలు, పరీక్షలు రాసే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.

నూతన పాఠ్యాంశాల ఆధారంగా మోడల్ పేపర్లు రూపొందించి యూనివర్సిటీకి అందజేయాలని బోర్డ్ ఆఫ్ స్టడీస్ వీసీ సూచించారు. ఫస్ట్ ఎంబీబీఎస్ బీవోఎస్ చైర్మన్ అపోలో మెడికల్ కళాశాల పిజియోలజీ హెచ్ డాక్టర్ బీ రాంకుమార్ కామన్ ఎంబీబీఎస్ బీవోఎస్ చైర్మన్ ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీ శశికళారెడ్డి వ్యవహరించారు. కార్యక్రమంలో రెక్టార్ డాక్టర్ టీ వెంకటేశ్వరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ డీ ప్రవీణ్ సీఈవో డాక్టర్ వై మల్లీశ్వర్, జాయింట్ రిజిస్ట్రార్ డాక్టర్ డీ రమేశ్ ఓఎస్డీ ఎస్ సత్యనారాయణ, డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ కే హేమంత్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యులు పాల్గొన్నారు.


logo