శనివారం 04 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 21, 2020 , 02:27:47

సేవలు విస్తృతం చేయాలి

సేవలు విస్తృతం చేయాలి


అర్బన్‌ కలెక్టరేట్‌, జనవరి20: వరంగల్‌ ఉమ్మ డి జిల్లా పరిధిలో కడియం ఫౌండేషన్‌ సేవలు విస్తృతం చేయడంతో పాటు నిరుపేదల కోసం మరిన్ని సేవ కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. సోమవారం హన్మకొండ హంటర్‌రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్‌లో కడియం ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ కావ్య అధ్యక్షతన మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వినయారాణి 40వ వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘దివ్యాంగుల ఉత్సవ్‌' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్‌విప్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి కు టుంబ సభ్యులు, అతిథులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మానసిక దివ్యాంగులు, విద్యార్థుల నృత్య, నాటికల ప్రదర్శన, డ్యాన్సులు ఆకట్టుకున్నాయి. కడియం శ్రీహరి వినయారాణిల దంపతులను చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ హిందుసంప్రదాయం ప్రకారం పూలదండలు మార్పించి శాలువాతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మానసిక వికలాంగులు, దివ్యాంగుల మధ్య కడియం దంప తులు వివాహ దినోత్సవాన్ని జరుపుకోవడం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. 30 ఏళ్లుగా కడియం శ్రీహరితో అనుంబంధం ఉందన్నారు. కష్టాలు ఎదుర్కొని వచ్చిన కడియంకు నిరుపేదల కష్టాలు తెలుసన్నారు. 

మూడేళ్లుగా అనేక కార్యక్రమాలు

మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన కడియం ఫౌండేషన్‌ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ కావ్య చెప్పారు. దసరా పండుగ రోజున నాన్నతో హన్మకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రానికి వెళ్లినప్పుడు తనలో వచ్చిన ఆలోచనతో  కడియం ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫౌం డేషన్‌ ద్వారా మెన్సూరేషన్‌ విషయంలో ఇప్పటి వరకు 5వేల పాఠశాలలోని లక్ష మంది బాలికలకు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు రక్తహీనత, ఎనిమియా ప్రెగ్నెన్సి తదితర అంశాలపై అవగాహన కల్పించామని తెలిపారు. మానసిక దివ్యాంగులను చిన్న చూపు చూడకుండా వారిని మనలో ఒకరిగా చూడాలన్నారు. 

దేవుడి ప్రతిరూపాలు..

మానసిక దివ్యాంగులు దేవుడి ప్రతిరూపాల ని, వారికి సేవ చేయడం ఎంతో పుణ్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఆడపిల్ల పుట్టిందని తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని, ఆడపిల్ల కుటుంబానికి రక్ష అన్నారు. వారికి మంచి విద్యా బుద్ధులు నేర్పితే  మంచి ప్రయోజకులు అవుతారని,  ముగ్గురు ఆడబిడ్డల తండ్రిగా చెపుతున్నాని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతోనే కడియం ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. రానున్న రోజుల్లో వరంగల్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో విస్తరించి సేవలు విస్తృతం చేస్తామన్నారు.  వివాహ దినోత్సవాన్ని మానసిక దివ్యాంగులు, దివ్యాంగులు, అభిమానుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చుకున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్‌  పేదల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. సమాజం ఇచ్చిన సహకారం, స్ఫూర్తితో ఈ స్థితిలోఉన్నాని, ముఖ్యంగా స్టేషన్‌ఘన్‌పుర్‌ ప్రజలు ఆశీర్వాదాన్ని జీవితంలో మరిచిపోనని అన్నారు. మానసిక వికలాంగులకు సేవ చేస్తున్న ఏడు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను కడియం ఈ సందర్భంగా అభినందించారు అనంతరం  స్వచ్ఛంద సంస్థల విద్యార్థులకు నోట్‌బుక్స్‌, టీషర్టులు, బ్లాంకెట్లు, ఇతర సామగ్రి అందజేశారు. అలాగే పలువురిని శాలువాతో సన్మానించి మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ పాండు, డాక్టర్‌ సుదీప్‌, కార్పొరేటర్‌ మిర్యాల్‌కార్‌ దేవేందర్‌, అనురాగ్‌హెల్పింగ్‌ సొసైటీ నిర్వాహకురాలు డాక్టర్‌ కే అనితారెడ్డి, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ మండల పరుశరాములు, రెడ్‌క్రాస్‌ రాష్ట్ర ఎంసీ మెంబర్‌ ఈవీ శ్రీనివాసరావు, ఫాదర్‌ జరో, ప్రొఫెసర్‌ పద్మ, బండా రమాలీల, వివిధ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థల, మనోవికాస కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.logo