బుధవారం 01 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 21, 2020 , 02:13:49

‘రైతుబంధు’ నిధులు విడుదల

‘రైతుబంధు’ నిధులు విడుదల


వరంగల్‌ సబర్బన్‌, నమస్తే తెలంగాణ : అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నాలుగో విడుత పంట పెట్టుబడి పైసలు నేరుగా రైతుల ఖాతాల్లోకి చేరనున్నాయి. ముందు గా గొప్పలకుపోయిన సర్కారు ఇప్పుడు ఆర్థికమాంద్యం బూచీ చూపి ఎగవేసే ప్రయత్నం చేస్తోందని కొందరు చేస్తున్న  దుష్ప్రచారాలను పటాపంచలు చేస్తూ సర్కారు నాలుగో  విడుత రైతు బంధు డబ్బులు విడుదల చేసింది. ఈ మేరకు నగదును కేటాయిస్తున్నట్లు సోమవారం సాయంత్రం జీవో 37ను విడుదల చేసింది. నాలుగో విడుత రైతుబంధు కోసం రూ.5100 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.12 వేల కోట్ల వరకు పంట పెట్టుబడి కో సం ప్రభుత్వం విడుదల చేసినట్టయింది. జిల్లాలో గతం కంటే ఈసారి రైతుల సంఖ్య సైతం గణనీయంగా పెరిగింది. కొత్తవారివి కూడా బ్యాంకు అకౌంట్లను సేకరించిన వ్యవసాయ శాఖ అధికారులు రైతుబంధు పోర్టల్‌లో నిక్షిప్తం చేశారు. అధికారులు వేగంగా రైతుల వివరాలను సేకరించే ప్రక్రియ చేపట్టారు. మరో వారం రోజుల్లో  రైతులకు డబ్బులు బ్యాంకు అకౌంట్లలో జమ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

దేశ వ్యవసాయ రంగంలో పెను సంచలనం సృష్టించిన రైతుబంధు పథకం రాష్ట్రంలో విజయవంతంగా ముందుకు సాగుతోంది. జిల్లా రైతులకు ఇప్పటికే మూడు విడుతలుగా పంట పెట్టుబడి కోసం రైతులకు నగదు రూపేణా రూ.240 కోట్లను పంపిన రా ష్ట్ర ప్రభుత్వం ఈసారి కొత్తగా పెరిగిన రైతులను కలుపుకుని మరో రూ.94 కోట్ల 45 లక్షలు ఇవ్వనుంది. గత లెక్కల ప్రకా రం జిల్లాలో 82,495 మంది రైతులుండగా,  ఈసారి ఏకంగా 84,620 మంది రైతులున్నారు. వీరికి రూ.94 కోట్ల 45 లక్షలు పెట్టుబడి కోసం సర్కారు అందించనుంది. ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ రైతుబంధు కోసం డబ్బులు కేటాయించడంతో అన్నదాతల్లో అంతులేని ఆనందం వ్యక్తమవుతోంది. అసలే వానాకాలపు పంటల నష్టంతో దిగాలుగా ఉన్న అన్నదాతలకు ఈ డబ్బులు మంచి ఉత్సాహాన్ని ఇవ్వనున్నాయి.  గతంలో రెండు విడుతలుగా ఎకరాకు ఏటా రూ.8 వేలు ఇచ్చిన ప్రభుత్వం ఇటీవల పంట పెట్టుబడిని ఎకరాలకు రూ.10 వేలకు పెంచింది. గత వానాకాలం సీజన్‌లో రైతుబంధు పోర్టల్‌లో ఆలస్యంగా అప్‌లోడ్‌ అయిన సుమారు 8 వేల మంది రైతులకు కూడా ఇప్పుడు డబ్బులు రానున్నాయి.


logo
>>>>>>