బుధవారం 08 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 20, 2020 , 03:57:07

తెలంగాణ ముద్దుబిడ్డ కాళోజీ

తెలంగాణ ముద్దుబిడ్డ కాళోజీ
  • -స్వరాష్ట్రంలోనే కవులు, కళాకారులకు గుర్తింపు
  • -రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌
  • -హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రం పనుల పరిశీలన

సిద్ధార్థనగర్‌, జనవరి 19: తెలంగాణ ముద్దు బిడ్డ, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత కాళోజీ నారాయణరావు అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, రైతు రుణ విమోచన కమిషన్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్లు, సీఎం  ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌, కాళోజీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, సలహాదారు అంపశయ్య నవీన్‌ కలిసి ఆయన నిర్మాణంలో ఉన్న కాళోజీ కళాక్షేత్రాన్ని పరిశీలించారు.  ప్లానింగ్‌ ఏవిధంగా ఉంది, ఎంత వరకు పనులు పూర్తయ్యాయి అంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం  ఆయన ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయభాస్కర్‌ క్యాంప్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కవులు, కళాకారులకు తీరని అన్యాయం జరిగిందని, కనీసం వారికి సరైన గౌరవం, గుర్తింపు లేకుండా పోయిందని ఆయన గుర్తుచేశారు.  కానీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం స్వతహాగా అక్షర పిపాసి అయిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ కవులు, కళాకారులకు దేశం గర్వపడేవిధంగా గుర్తింపు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. 

ఆంధ్రపాలనలో చరిత్రను విస్మరించి, కళలను, కళాకారులను గుర్తించకపోవడాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మన కవుల్ని మనమే గుర్తించుకోవాలి. మన వాళ్లను మనమే గౌరవించుకోవాలని భావించారని ఆయన అన్నారు.  ఉద్యమ సమయంలో చెప్పిన విధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని యూనివర్సీటీల విభజన అనంతరం హెల్త్‌ యూనివర్సిటీని స్థాపించి దానికి ప్రజాకవి కాళోజీ పేరు పెట్టడమే కాకుండా దేశంలో  ఎక్కడా లేని విధంగా  వరంగల్‌ సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా కాళోజీ కళాక్షేత్రం నిర్మిస్తున్నామని ఆయన వివవరించారు.  రాబోయే తరాలు స్మరించుకునే విధంగా చేశారని అన్నారు. తెలంగాణాకు ప్రజాకవి కాళోజీ నిస్వార్ధమైన సేవలు అందించారని ఆయన కొనియాడారు. కళాక్షేత్రం నిర్మాణానికి సుమారు రూ. 35కోట్ల  ఖర్చుఅవుతాయని అంచన వేశారన్నారు. ప్రస్త్తుతం కాకతీయ పట్టణాబివృద్ధ్ది సంస్త్ధ నిధులతో కాళోజీ కళాక్షేత్రంను నిర్మాణ పనులు వేగం పెంచుతున్నామని అన్నారు. ప్రస్తుతం నిధుల కొరత లేదని, ఇప్పటి వరకు 11కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు చేపట్టారని అన్నారు.

300 గజాలు కూడా ఇవ్వలే : చీఫ్‌ విప్‌ దాస్యం

 ఆంధ్రపాలకులు కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం కోసం 300గజాల స్థలం కూడా ఇవ్వలేదని   చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీర్‌  స్థలంతో పాటు నిధులు కేటాయించారని అన్నా రు.  సమావేశంలో కార్పొరేటర్లు నల్లాస్వరూపరాణి సుధాకర్‌రెడ్డి, కేశబోయిన అరుణశ్రావణ్‌, వీరగంటి రవీందర్‌, తాడిశెట్టి విద్యాసాగర్‌, మిర్యాలకార్‌ దేవేందర్‌,  కుడా డైరెక్టర్‌ బోర్ర ఐలయ్య, కాళోజీ నారాయణరావు మిత్ర మండలి ఫౌండేషన్‌ అధ్యక్షులు నాగిళ్ల రామశాస్త్రీ, కోశాధికారి పందిళ్ళ అశోక్‌, సెక్రటరీ వీఆర్‌ విద్యార్ధి, జాయింట్‌ సెక్రటరీ పొట్లపల్లి శ్రీనివాసరావు, అడ్వైజర్‌ అంపశయ్య నవీన్‌  పాల్గొన్నారు.

 తెలంగాణ మాగాణం కాళోజీ : సీఎం ఓఎస్‌డీ దేశపతి 

ప్రజాకవి కాళోజీ తెలంగాణ సముజ్వల చరిత్రకు దర్పణమని, తెలుగు సాహితీ క్షేత్రంలో కాళోజీ ధిక్కార బావుటా ఎగరేసిన మహోన్నత శిఖరమని సీఎం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ కాళోజీ ఆశీస్సులతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపారని ఆ మహోన్నత వ్యక్తికి సముచిత గౌరవం ఇవ్వడం కోసం వరంగల్‌ చరిత్రను మరింత ఇనుమడింప చేసేందుకు సీఎం కేసీఆర్‌ ప్రజాకవి కాళోజీ పేరుతో కళాక్షేత్రం నిర్మిస్తున్నారన్నారు. కాళోజీ షౌండేషన్‌ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి మాట్లాడుతూ ప్రజాకవి కాళోజీకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబడి అద్భుతమైన నిర్మాణ సౌధాన్ని నిర్మిస్తుందన్నారు.  ఈ సౌధం భవిష్యత్‌ తరాలకు వారధిగా ఉంటుందని ఇక నిర్మాణ పనులకు ఏ ఆటంకాలు లేకుండా కొనసాగేందుకు ఈసెం కేసీఆర్‌ పూనుకోవడం శుభపరిణామన్నారు.logo