ఆదివారం 24 మే 2020
Warangal-city - Jan 19, 2020 , 02:09:46

నేడు పల్స్‌ పోలియో

నేడు పల్స్‌ పోలియో
  • - జిల్లాలో 0-5 సంవత్సరాల పిల్లలు 94,214
  • - 579 పోలియో చుక్కల కేంద్రాలు
  • -ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ లలితాదేవి

రెడ్డికాలనీ, జనవరి 18: జాతీయ పల్స్‌ పోలి యో కార్యక్రమంలో భాగంగా ఆ దివారం 0-5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ రెండో విడత పోలియో చుక్కలు వేయించడానికి అన్ని ఏర్పా టు పూర్తి చేసినట్లు ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ లలితా దేవి తెలిపారు. శనివారం వరంగల్‌లోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పల్స్‌పోలియో కార్యక్రమానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. తల్లిదండ్రులు ఆదివారం పోలియో కేంద్రాల వద్దకు పిల్లలను తీసుకువచ్చి పల్స్‌పోలియో చుక్కలు వేయించాలని ఆమె కోరారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 0-5 సంవత్సరాల పిల్లల సంఖ్య మొత్తం 94214 ఉన్నారని వారికి 579 పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అర్బన్‌ ప్రాంతంలో 299, గ్రా మాల్లో 270, మొబైల్‌ బూత్‌లు 38, ట్రాన్సిట్‌ బూత్‌లు 27 ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తం సిబ్బంది 2394, మొబైల్‌ పర్యవేక్షకుల సంఖ్య 64, సంచార ప్రదేశాలు, హైరిస్క్‌ ప్రాం తాలు 103 ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 17 పట్టణ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కేంద్రాల ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించ నున్న ట్లు తెలిపారు. ఆదివారం ఉదయం 7 నుంచి సాయం త్రం 6 గంటల వరకు పోలియో కేంద్రాల వద్ద చుక్కలు వేస్తారని తెలిపారు. పోలియో చుక్కలు వేయించు కోని వారి కోసం 20, 21వ తేదీల్లో ఇంటింటికీ తిరిగి వేయనున్నట్లు పేర్కొన్నారు. ఆ దివారం ఉదయం 8 గంటలకు హన్మకొండలో ని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి (జీఎంహెచ్‌)లో కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ పమేలా సత్పతి పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు డాక్టర్‌ లలితాదేవి తెలిపా రు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాకుబ్‌పాషా, డీఐవో గీతాలక్ష్మీ, డాక్టర్‌ ప్రశాం త్‌, డాక్టర్‌ కృష్ణారావు, వేముల అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి

కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌

అర్బన్‌కలెక్టరేట్‌: అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్‌ ప్ర శాంత్‌ జీవన్‌ పాటిల్‌ తెలిపారు. నేడు ఆదివారం నిర్వహిస్తున్న పోలియో చుక్కల కార్యక్రమాన్ని పురస్కరించుకొని కలెక్టర్‌ మాట్లాడారు. తమ పిల్లల భవిష్యత్తు కో సం, పోలియో రహిత సమాజం కోసం తల్లిదండ్రులు అంతా ఐదు సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లలందరికీ తప్పకుండా చుక్కలు వేయించాలని కోరారు. జ్వరం వచ్చినప్పటికీ పోలియో చుక్కలు వేయించవచ్చని తెలిపారు. వివిధ శాఖల సమన్వయంతో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. జిల్లావ్యాప్తంగా 94,214 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలనే లక్ష్యంగా పెట్టుకు న్నామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ, విద్యా శాఖ, స్త్రీ శిశుసంక్షేమ శాఖ, విద్యుత్‌శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాల ని కలెక్టర్‌ ఆదేశించారు.logo