మంగళవారం 31 మార్చి 2020
Warangal-city - Jan 15, 2020 , 03:03:42

కలర్‌ఫుల్‌ కైట్స్‌..

కలర్‌ఫుల్‌ కైట్స్‌..

సుబేదారి, జనవరి 14:  కలర్‌ఫుల్‌ కైట్స్‌.. కనువిందు చేశాయి. పతంగుల పండుగ సరికొత్త రంగుల ప్రపంచాన్ని చూపించింది. రంగురంగుల పతంగులను ఎగురవేస్తూ పిల్లలు, పెద్దలు సంబురపడ్డారు. సంక్రాంతి సందర్భంగా వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, కుడా, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో సుబేదారి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో మంగళవారం నిర్వహించిన  పతంగుల పండుగ వేడుకలను సంతోషంగా జరుపుకున్నారు. వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ విశ్వనాథ రవీందర్‌, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ పమేలా సత్పతి పంతంగులను ఎగురవేసి లాంఛనంగా వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయంలో వరంగల్‌కు ప్రత్యేకత ఉందనారు. ప్రతి ఒక్కరిజీవితం పంతంగుల రంగుల ప్రపంచంగా ఉండాలని అన్నారు. ఆడపిల్లను రక్షించుకుందామని పిలునిచ్చారు. సీపీ రవీందర్‌ మాట్లాడుతూ మన సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా స్రవంతి కూచిపూడి కళాక్షేత్రం చిన్నారుల నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా కమిషనర్‌ పమేలా సత్పతి ముగ్గు వేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్‌ యోగేశ్‌ గౌతమ్‌, పర్యాటకశాఖ జిల్లా అధికారి శివాజీ, కార్పొరేషన్‌, కుడా, పర్యాటకశాఖ, ఐసీడీఎస్‌ అధికారులు పాల్గొన్నారు. ఐసీడీఎస్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి అంగన్‌వాడీ టీచర్స్‌ వేసిన ఆడపిల్లను ‘రక్షిద్దాం, చదువనిద్దాం, ఎదుగనిద్దాం’ అనే నినాదంతో వేసిన ముగ్గు ఆలోచింపజేసింది.logo
>>>>>>