శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 15, 2020 , 03:03:10

మెరిసిన ముగ్గులు.. మురిసిన లోగిళ్లు

మెరిసిన ముగ్గులు.. మురిసిన లోగిళ్లు


నమస్తే తెలంగాణ ఫొటోగ్రాఫర్‌, వరంగల్‌ :  భూతల్లి అలంకరించుకుంది. చక్కని చుక్కల ముగ్గులతో అం దంగా ముస్తాబైంది. సంక్రాంతి సాక్షిగా సప్తవర్ణాల శోభితమై తెలుగు వాకిళ్లు మురిసిపోయాయి. సంక్రాంతి రాగానే.. మహిళల చేతుల్లోంచి  రెండు అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. వీటిలో పిండివంటలు కాగా, మరోటి వాకిట్లో ముగ్గులు.. సకినాలు నోరూరిస్తే.. ముగ్గులు కనువిందు చేస్తాయి. సంక్రాంతి పండుగ రోజుల్లో అమ్మాయిలు ముగ్గులు వేసేందుకు ముచ్చట        పడతారు. సంక్రాంతికి ఏం ముగ్గు వేయాలా.. అని వారం రోజుల ముందు నుంచే కసరత్తులు మొదలుపెడుతున్నారంటే.. వీరు సంక్రాంతి ముగ్గులపై ఎంతటి ఆసక్తి కనబరుస్తారో అర్థం చేసుకోవచ్చు..  మంగళవారం భోగి సందర్భంగా  వరంగల్‌ నగరంలో మహిళలు ఉదయాన్నే లేచి రంగవల్లులు వేసే పనిలో నిమగ్నమయ్యారు. పలు రకాల ముగ్గులను వేసి కనువిందు చేశారు.     logo