మంగళవారం 31 మార్చి 2020
Warangal-city - Jan 15, 2020 , 03:02:41

సంప్రదాయాలను భవిష్యత్‌ తరాలకు అందించాలి

సంప్రదాయాలను భవిష్యత్‌ తరాలకు అందించాలి


హసన్‌పర్తి, జనవరి 14 :  మన పూర్వీకుల నుంచి అనాదిగా వస్తున్న సంప్రదాయాలను భవిష్యత్‌ తరాలకు అందించాలని  వాసవీ క్లబ్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌ చకిలం రాజేశ్వర్‌రావు అన్నారు. స్థానిక ఆర్యవైశ్య భవన్‌లో వాసవీ క్లబ్‌  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పతంగుల పంపిణీ కార్యక్రమం క్లబ్‌ అధ్యక్షుడు అయిత రవీందర్‌ అధ్యక్షతన మంగళవారం జరిగింది.  ఈ సందర్భంగా పిల్లలకు పతంగులను అందజేశారు. కార్యక్రమంలో క్లబ్‌ కోశాధికారి మంచెన శ్యాంసుందర్‌, మాజీ అధ్యక్షుడు చిదర భాస్కర్‌,  సతీశ్‌,  విజయ్‌,  లక్ష్మణ్‌,  వెంకటేశ్వర్లు, ధర్మేందర్‌, శ్రీనాథ్‌, సంతోష్‌ పాల్గొన్నారు.      


logo
>>>>>>