గురువారం 09 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 14, 2020 , 03:32:34

శరణు శరణు.. ఐలోని మల్లన్న..

శరణు శరణు.. ఐలోని మల్లన్న..
  • వైభవంగా ప్రారంభమైన మల్లికార్జునుడి బ్రహ్మోత్సవాలు
  • స్వామివారికి ఒగ్గు పూజారుల మేలుకొలుపు
  • తరలివస్తున్న భక్తజనం

ఐనవోలు, జనవరి 13: ఐనవోలు మల్లికార్జునస్వామి బ్ర హ్మోత్సవాలు సోమవారం ధ్వజారోహణంతో వైభవంగా మొదలయ్యాయి. ముందుగా స్వామివారికి ఒగ్గుపూజారులు మేలుకొలుపు చేశారు. శైవాగమ పద్ధతిలో అర్చకులు ప్రాత:కాలంలో విఘ్నేశ్వరపూజ, రుద్రాభిషేకం, నూతన వస్ర్తాలంకరణ చేశారు. ఉదయం గణపతిపూజ శైవశుద్ధి, పుణ్యాహవాచనం నిర్వహించారు. ఉత్సవ ప్రారంభ సూచికగా కాషాయ ధ్వజ పతాకలను చేతపట్టి మంగళవాయిధ్యాలతో అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో మూడు సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షణ చేశారు. ఆల య శిఖరంపై క్షేత్రపాలకుడు అంజనేస్వామి గుడిపై ఎగురవేశారు. అనంతరం మహన్యాపూర్వక రుద్రాభిషేకం, మహానివేదన నీరాజన మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ చేసి ఉత్సవా లు ప్రారంభమైనట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఈవో నాగేశ్వర్‌రావు, ముఖ్య అర్చకుడు పా తర్లపాటి రవీందర్‌, వేద పండితులు పురుషోత్తమశర్మ, పురోహిత్‌ ఐనవోలు మధుకర్‌శర్మ, ముఖ్య అర్చకులు శ్రీనివాస్‌, దేవగిరి బీమన్న,  పాతర్లపాటి నరేశ్‌శర్మ(చిక్క), నందనం మధుశర్మ, నందనం భానుప్రసాద్‌, ఉ ప్పుల శ్రీనివాస్‌, సిబ్బంది కిరణ్‌, మధుకర్‌ పాల్గొన్నారు.  

నేడు ప్రత్యేక పూజలు

బోగి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో మంగళవారం ఉదయం స్వామి వారికి ప్రాత:కాలం మేలుకొలుపుతో ప్రత్యేక పూజలు ప్రారంభంకానున్నాయి. విఘ్నేశ్వరపూజ, పు ణ్యాహవచం, మహన్యాసపూర్వక ఏకాదశి, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, రాద్రాభిషేకం నిర్వహించనున్నారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు  భక్తులకు స్వామివారు దర్శనమిస్తారు.

ప్రముఖుల రాక 

బోగి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ కుటుంబ సభ్యులు, రాష్ట్ర రైతు రు ణ విమోచన చైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, రాష్ట్ర నాయకులు బీరవెళ్లి భరత్‌కుమార్‌రెడ్డి స్వా మి వారిని దర్శించుకోనున్నట్లు ఎంపీపీ మార్నేని మధుమతి ర వీందర్‌రావు తెలిపారు.

ఆర్‌టీసీ బస్సు క్యాంపు ప్రారంభం

ఐనలోని మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్టీసీ హన్మకొండ డిపో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్‌స్టాండ్‌ను ఆర్‌ఎం అంచూరి శ్రీధర్‌తో కలిసి ఎంపీపీ మార్నేని మధుమతి రవీందర్‌రావు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ.. జాతరకు సుమారుగా 100 బ స్సు సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపారు. ఐనవోలు నుంచి కొ మురవెల్లి, యాదగిరిగుట్ట, వరంగల్‌కు సర్వీసు న డుపుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈవో అద్దంకి నాగేశ్వర్‌రావు, డి పో మేనేజర్‌ హన్మకొండ మోహన్‌రావు, అసిస్టెంట్‌ మేనేజర్లు ప్రసూనలక్ష్మి, జ్యోత్స్న, కక్కిరాలపల్లి సర్పంచ్‌ కంజర్ల రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo