సోమవారం 30 మార్చి 2020
Warangal-city - Jan 14, 2020 , 03:25:22

వీరమళ్ల ప్రకాశ్‌కు జాతీయ అవార్డు

వీరమళ్ల ప్రకాశ్‌కు జాతీయ అవార్డు
  • -బసవ కృషి జాతీయ అవార్డుకు ఎంపిక
  • -తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం

ములుగు జిల్లా ప్రతినిధి/నమస్తేతెలంగాణ: కర్నాటక రాష్ట్రంలోని అఖిల భారత లింగాయత్‌ పంచమశాలి మహాపీఠం ప్రథమ జగద్గురువు బసవ మృత్యుంజయ స్వామిజీ బసవ కృషి జాతీయ అవార్డుకు ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం పాలంపేట గ్రామానికి చెందిన రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వీరమల్ల ప్రకాశ్‌ను ఎంపిక చేశారు. ఈ  అవార్డుతో పాటు రూ.లక్ష నగదును బహుమతిగా అందజేయనున్నారు. గతంలో ఈ అవార్డును పొందిన వారిలో రాజేంద్రసింగ్‌, అన్నాహజారే, మేధాపాఠ్కర్‌, త్రిపుర మాజీ సీఎం మానిక్‌ సర్కార్‌, ఎంఎస్‌ స్వామినాథన్‌ వంటి ప్రముఖులు ఉన్నారు. మంగళవారం ఈ అవార్డును ఆల్మట్టి డ్యామ్‌ సమీపంలోని కూడలి సంఘంలో ఆయనకు బహూకరించనున్నారు. 

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర 

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రకాశ్‌ అత్యం త కీలక పాత్ర పోషించారు. రైతుల ఆత్మహత్యల నివా రణకు తెలంగాణ రాష్ట్ర సాధన తప్ప మరోమార్గం లేద ని 1997నుంచి ఆచార్య జయశంకర్‌తో కలిసి మలిదశ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకు పూర్వమే సాగునీటి రంగంలో జరుగుతున్న అన్యాయాలపై అనేక వ్యాసాలు రాసి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకుల్లో ప్రకాశ్‌ ఒకరు. 

నీటి వనరుల సంరక్షణలో 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్‌ వీరమల్ల ప్రకాశ్‌ను తెలంగాణ జన వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమించారు. సీఎం కేసీఆర్‌ ఆలోచన తీరు మేరకు తెలంగాణ జలవనరుల అభివృద్ధి, నీటి పొదు పు, భూగర్భజలాల పెంపు వంటి వాటిపై దృష్టి సారిం చారు. రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా భూ గర్భ జలశాఖ వాలంటరీ కార్యక్రమాలను పర్యవేక్షి స్తున్నారు. రీచార్జింగ్‌ షాప్ట్స్‌ ద్వారా భూ గర్భ జలాల పెంపుపై కృషి చేశారు. గత సంవత్సరం  కృష్ణానది పునర్జీవనం కోసం వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రా జేంద్రసింగ్‌తో కలిసి కృష్ణా కుటుంబాన్ని ఏర్పాటు చేసి నది పరిరక్షణ కోసం అనేక కార్యక్ర మాలను చేపట్టారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించేందుకు భూసార పరిరక్షణ అంశాలపై వాలం తరీలో రైతులకో సం సర్టిఫికెట్‌ కోర్సును నిర్వహిం చారు. 


 సీఎం  కేసీఆర్‌, ప్రజల సహకారానికి నిదర్శనం అవార్డు

అఖిల భారత లింగాయత్‌ పంచమశాలి మహాపీఠం ప్రథమ జగద్గురువు బసవ మృత్యుంజయ స్వామీజీ బసవకృషి జాతీయ అవార్డుకు ఎంపిక చేయడం ఆనందంగా ఉంది. ఇది తెలంగాణ రాష్ట్ర గౌరవం, సీఎం కేసీఆర్‌ కృషి, తెలంగాణ ప్రజలు అందించిన సహకారానికి నిదర్శనం. అన్నాహజారే, రాజేంద్ర సింగ్‌, మేధాపాఠ్కర్‌ లాంటివారు అందుకున్న అవార్డు ను నేను అందుకోవడం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం. ఈ అవార్డు నీటి వనరుల సంరక్షణపై మరిం త దృష్టి సారించేలా ఉత్సాహాన్ని ఇస్తుంది.

- వీరమల్ల ప్రకాశ్‌, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌


logo