శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 13, 2020 , 03:52:36

మార్చిలో అర్చకుల బహిరంగ సభ

మార్చిలో అర్చకుల బహిరంగ సభ

రెడ్డికాలనీ, జనవరి 12: మార్చిలో హైదరాబాద్‌లో అర్చకుల బహిరంగసభ ఏర్పాటు చేసి అర్చక శంఖారావం పూరిస్తామని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంగు ఉపేంద్రశర్మ అన్నారు. తెలంగాణ అర్చక సమాఖ్య స మావేశం 31 జిల్లాల ప్రతినిధులతో ఆదివారం హన్మకొండ వేయి స్తంభాల గుడి కుడా గార్డెన్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు చి లకమర్రి శ్రవణ్‌ కుమారాచార్యులు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంగు ఉపేంద్రశర్మ, డీడీఎన్‌ స్కీం రాష్ట్ర అధ్యక్షుడు ఏటూరి ఆంజనేయాచారి హాజరయ్యారు. ఈసందర్భంగా గంగు ఉపేంద్రశర్మ మా ట్లాడుతూ అర్చకుల డిమాండులన్నీ పరిష్కారమయ్యే వరకు పోరాడుతామని అన్నారు. 31 జిల్లాల ప్రతినిధులు ములుగు జిల్లా కోమల పెల్లి హరీశ్‌, కొండపాక సత్యనారాయణాచారి (పెద్దపల్లి), దబ్బట శ్రీనివాసాచారి (జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా), తిగుళ్ల వేణుగోపాల్‌శర్మ (మెదక్‌), వీరభద్రశర్మ (సూర్యాపేట), గోవర్ధనం సంపత్‌స్వామి (మంచిర్యాల) చెరుకుపల్లి రాహుల్‌ ఆచా ర్య (కరీంనగర్‌), జిల్లా నవీన్‌ (రాజన్న సిరిసిల్ల), శివకుమార్‌ (జనగామ), తమ్మళి వేణయ్య (మహబూబ్‌నగర్‌), కే వెంకటనర్సింహచార్యులు (సిద్దిపేట), జక్కాపు రం నారాయణ్‌స్వామి (కరీంనగర్‌ జిల్లా సమన్వయకర్త), సంగనభట్ల నరహరిశర్మ (ఆదిలాబాద్‌) సీహెచ్‌ శ్రవణ్‌కుమారాచార్యులు (నల్గొండ), దామతారు రఘుశర్మ (ఖమ్మం), భాస్కర్‌ (నిజామాబాద్‌), గన్నోజు సత్యనారాయణాచార్యులు (నాగ ర్‌కర్నూల్‌), చెరుకు రాజేశ్వర్‌శర్మ (జగిత్యాల) జిల్లాల కార్యదర్శులు హారయ్యారు. వరంగల్‌ జిల్లా బ్రాహ్మణ సంఘం నాయకులు వల్లూరి పవన్‌కుమార్‌ జీవీఎస్‌ శ్రీనివాసాచారి, పెండెం రాఘవరావు, ఎన్వీఎన్‌ పురుషోత్తం, విన్నకోట రాజ్‌కు మార్‌ తదితరులు పాల్గొన్నారు. 


ఈసందర్భంగా సమావేశంలో నాలుగు తీర్మాణా లను ప్రవేశపెట్టారు. ధూపదీప నైవేద్య పథకం కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.6 వేల నుంచి రూ.10 వేల పెంచాలని, 577 జీవో ప్రకారంగా 5625 మందికి వేతనాలు ఇవ్వాలని, 58 సంవత్సరాల నుంచి అర్చకుల రిటైర్‌మెంట్‌ వయస్సును 65 సం వత్సరాలకు పెంచాలని వారు కోరారు. 


logo