సోమవారం 30 మార్చి 2020
Warangal-city - Jan 13, 2020 , 03:51:20

వివేకానందుడి బోధనలు ఆదర్శనీయం

వివేకానందుడి బోధనలు ఆదర్శనీయం
  • - చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌
  • - ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు
  • - పాల్గొన్న మేయర్‌ ప్రకాశ్‌రావు, ఎమ్మెల్యే నరేందర్‌

మట్టెవాడ, జనవరి 12: వివేకానందుడి బోధనలు నేటి యువతకు ఆదర్శనీయమని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. వరంగల్‌ నగరంలోని పాపయ్యపేట చమన్‌లో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద విగ్రహ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో కలిసి  వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  అనంతరం వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద  జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని,  ఆయన బోధనలు, మార్గాలను అనుసరించాలని పిలుపునిచ్చారు. అనంతరం విగ్రహదాతలు రాయబారపు వెంకటేశ్వర్లు కుమారులు రవి, దయానంద్‌, ఆనంద్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వరంగల్‌ ఏసీసీ సారంగపాణి, డాక్టర్‌ చందా విజయ్‌కుమార్‌, శ్రీరాం శివాజీ, జట్లింగ్‌ ఎల్లో సా, పాలారపు కృష్ణమూర్తి, ఎడబోయిన శ్రీనివాసరెడ్డి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు రాచర్ల రాము, 27వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు దేవరకొండ సురేందర్‌, 24వ డివిజన్‌ అధ్యక్షుడు సదాంత్‌, మాల కుమ్మరి పరశురాములు, జానీ దర్శన్‌ సింగ్‌, రాచర్ల కుమారస్వామి, గాదే వాసుదేవ్‌ పాల్గొన్నారు. 


logo