గురువారం 02 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 12, 2020 , 04:08:14

వాసవీ క్లబ్‌లు సామాజిక సేవలో ముందుండాలి

వాసవీ క్లబ్‌లు సామాజిక సేవలో ముందుండాలికాజీపేట, జనవరి 11: వాసవీ క్లబ్‌, వాసవీ వనితా క్లబ్‌లు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని వాసవీ క్లబ్‌ అంతర్జాతీయ డైరెక్టర్‌ దొడ్డ మోహన్‌రావు సూచించారు. కాజీపేట పట్టణంలోని శ్రీ భ్రమరాంభిక మల్లికార్జునస్వామి దేవాలయంలో స్థానిక వాసవీ క్లబ్‌, వాసవీ వనితా క్లబ్‌ల 2020 నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం జిల్లా గవర్నర్‌ గార్లపాటి సంతోష్‌కుమార్‌ అధ్యక్షతన శనివారం జరిగింది. కార్యక్రమానికి  అంతర్జాతీయ డైరెక్టర్‌ మోహన్‌రావు హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో క్లబ్‌లు ముందుండాలన్నారు. అనంతరం పేదలకు  బ్లాంకెట్లు పంపిణీ చేశారు. నూతన కార్యవర్గంలో అధ్యక్షుడు కొడకండ్ల సూర్యప్రకాశ్‌-శ్రీదేవి, కార్యదర్శులుగా గందె రాము-శోభ, కోశాధికారులుగా గంపా సిద్దిలింగం-సరళ  ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా  క్యాబినెట్‌ కార్యదర్శి తోట వైద్యనాథ్‌, నూతన్‌కుమార్‌, గంపా  సాంబమూర్తి, వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రశేఖర్‌, మహేందర్‌, శ్యాంసుందర్‌, అశోక్‌, యాదగిరి, రామానుజం, వీర ప్రకాశ్‌, రాజు, ప్రభాకర్‌, గోపాల్‌, భవానీ, లీలావతి, సంధ్య పాల్గొన్నారు.


logo