ఆదివారం 29 మార్చి 2020
Warangal-city - Jan 12, 2020 , 04:07:09

పొగాకు రహిత సమాజాన్ని నిర్మిద్దాం

పొగాకు రహిత సమాజాన్ని నిర్మిద్దాం
  • -కేయూ పరీక్షల నియంత్రణాధికారి
  • -ప్రొఫెసర్‌ ఎస్‌ మహేందర్‌రెడ్డి


రెడ్డికాలనీ, జనవరి 11: సమాజంలో పొగాకు వా డకం లేకుండా ప్రతిఒక్కరూ కృషి చేయాలని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ ఎస్‌ మహేందర్‌రెడ్డి అన్నారు. పొగాకు నియంత్రణకు పరీక్షల విభాగం సిబ్బంది సీనియర్‌ అసిస్టెంట్‌ ఎన్‌ శంకర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ హసీనాబేగం రూపొందించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు పరీక్షల అధికారి డాక్టర్‌ వై వెంకయ్య, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ అశోక్‌బాబు, రామా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ధూమపానానికి దూరంగా ఉండాలి

పొగాకు, ధూమపానానికి దూరంగా ఉండాలని యూనివర్సిటీ మహిళా ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య టీ శ్రీనివాసులు విద్యార్థులకు సూచించారు. బోధనేతర సిబ్బందిచే తయారుచేయబడిన ‘టొబాకో ఫ్రీ క్యాంపస్‌' వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ పొగాకు వినియోగం, ధూమపానం చేస్తే ఆ ప్రభా వం కేవలం ఆ వ్యక్తినే కాకుండా మొత్తం కుటుంబం, పరిసరాలపై ప్రభావం చూపెడుతుందన్నారు. కార్యక్రమంలో కేయూ క్యాంపస్‌ ప్రిన్సిపాల్‌ ఆచార్య కే డేవిడ్‌, సహాయ రిజిస్ట్రార్‌ డాక్టర్‌  నరసింహారావు, ఉద్యోగులు పాల్గొన్నారు.


logo