శనివారం 04 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 12, 2020 , 04:06:37

టీఎస్‌ డెమోక్రసీ అవార్డులు అందుకున్న అధికారులు

టీఎస్‌ డెమోక్రసీ అవార్డులు అందుకున్న అధికారులుధర్మసాగర్‌: జిల్లాకు చెందిన ఐదుగురు అధికా రులు తెలంగాణ రాష్ట్ర డెమోక్రసీ అవార్డులను అం దుకున్నారు. జిల్లా పంచాయతీ అధికారి మహమూ ది, జెడ్పీ సూపరింటెండెంట్‌ వెంకటరమణ, కాజీపే ట ఏసీపీ నర్సింగారావు, ధర్మసాగర్‌ ఎంపీడీవో జవహార్‌రెడ్డి, భీమదేవరపల్లి మండల పంచాయతీ అధికారి శ్యాంకుమార్‌ శనివారం హైదరాబాద్‌లో గర్నవర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌, మంత్రి ఎర్రబెల్లి ద యాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ చేతులమీదుగా అవార్డులను స్వీకరించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఉత్తమ పనితీ రు కనబర్చిన అధికారులను గుర్తించి రాష్ట్ర ప్రభు త్వం ఈ అవార్డులను అందజేసింది.


logo