మంగళవారం 31 మార్చి 2020
Warangal-city - Jan 12, 2020 , 04:05:55

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
  • -తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌


వరంగల్‌,నమస్తేతెలంగాణ : కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థపై నమ్మకంతో ఓ-సిటీలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి నమ్మకాన్ని నిలబెట్టేలా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. శనివారం కుడా కార్యాలయంలో ఆయన కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డితో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల్లో జాప్యంతో ఓ-సిటీవాసులు తన వద్దకు వచ్చి మొరపెట్టుకుంటున్నారని, కుడా అధికారులు ఇచ్చిన హామీ మేరకు ఆర్చిలు, రోడ్లు, సింథటిక్‌ వాకింగ్‌ ట్రాక్‌, ఓ-సిటీ చుట్టూ ప్రహరి, పార్క్‌ నిర్మాణాలు వెంటనే చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. తూర్పు నియోజకవర్గంలో ‘కుడా’ అధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. దీనిపై స్పందించిన గ్రేటర్‌ కమిషనర్‌, ‘కుడా’ వైస్‌ చైర్మన్‌ పమేలా సత్పతి ఉగాది వరకు ఓ-సిటీలో అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని అన్నారు. సమావేశంలో కుడా ప్లానింగ్‌ అధికారి అజిత్‌ రెడ్డి, కార్యదర్శి మురళీధర్‌రావు, ఈఈ భీంరావు, డీఈ వెంకటేశ్వర్లు ఉన్నారు.

కమిషనర్‌కు ఎమ్మెల్యే శుభాకాంక్షలు

గ్రేటర్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన పమేలా సత్పతికి తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌  శుభాకాంక్షలు తెలిపారు. ‘కుడా’ కార్యాలయంలో సమీక్ష సమావేశం సందర్భంగా ఆమెకు ఎమ్మెల్యే పుష్పగుచ్ఛం అందజేశారు. ఆయనతో పాటు కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు వస్కుల బాబు ఉన్నారు.


logo
>>>>>>