మంగళవారం 31 మార్చి 2020
Warangal-city - Jan 12, 2020 , 04:05:00

‘ఏకశిల’లో సంక్రాంతి సంబురాలు

‘ఏకశిల’లో సంక్రాంతి సంబురాలు


రెడ్డికాలనీ, జనవరి 11: హన్మకొండ రెడ్డికాలనీలోని ఏకశిల కాన్సెప్ట్‌ స్కూల్‌లో శనివారం సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఐఈవో ప్రశాంతి హాజరై మాట్లాడుతూ తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలను భవిష్యత్‌ తరాలకు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. పాఠశాల విద్యాసంస్థల చైర్మన్‌ గౌరు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ మన సంస్కృతీ సంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు చదువుతో పాటు కళల పట్ల తగిన నైపుణ్యం పెంపొదిస్తున్నామని అన్నారు. అనంతరం ముగ్గుల పోటీల్లో విజేతలు జే మాధవి(ప్రథమ బహుమతి), కే మమత(ద్వితీయ), తరుణి(తృతీయ), అహల్యకు ప్రోత్సాహక  బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో స్వప్నాజితేందర్‌రెడ్డి, విజిత, అపర్ణ, సాధ్వి, శోభారాణి, రవి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


logo
>>>>>>