శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 09, 2020 , 16:43:39

పల్లె ప్రగతిలో భాగస్వాములు కావాలి

పల్లె ప్రగతిలో భాగస్వాములు కావాలి

-పంచాయతీ రాజ్‌ డిప్యూటీ కమిషనర్‌ సుధాకర్‌
ఆత్మకూరు, జనవరి 08 : అన్ని వర్గాల ప్రజలు పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పంచాయతీ రాజ్‌ డిప్యూటీ కమిషనర్‌ సుధాకర్‌ కోరారు. మండలంలోని కొత్తగట్టు, పెంచికలపేట గ్రామాల్లో జరుగుతున్న రెండో విడత పల్లె ప్రగతి పనులను బుధవారం ఆయన పరిశీలించారు. గ్రామాల్లో డంపింగ్‌ యార్డులను, వైకుంఠధామాలను, నర్సరీ పనులను పర్యవేక్షించారు. ముందు ఉన్న పెంట కుప్పులను తొలగించాలని స్థానికులకు సూచించారు. మిషన్‌ భగీరథ నీళ్లు ఇస్తున్నప్పటికీ ఓపెన్‌ వెల్స్‌ మోటర్స్‌ను ఎందుకు ఉపయోగిస్తున్నారని అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. నిరక్ష్యరాస్యుల గుర్తింపు సర్వే గురించి కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికీ తిరిగి ట్రాక్టర్‌ ద్వారా చెత్తను సేకరిస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు. గ్రామాల్లో పాత ఇండ్లను తొలగించాలని ఆదేశించారు. ఇంకుడు గుంతలను ప్రతి ఇంటిలో కట్టుకునేలా సర్పంచ్‌, కార్యదర్శి బాధ్యత తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పరకాల, నర్సంపేట డీఎల్పీవోలు కల్పన, వెంకటేశ్వర్లు, ఎంపీడీవో నర్మద, ఎంపీవో చేతన్‌రెడ్డి, సర్పంచ్‌లు కొరే లలిత, బొళ్ల నరేశ్‌, పంచాయతీ కార్యదర్శులు కల్యాణి, మోహన్‌రావు, ఈసీ రాములు పాల్గొన్నారు.


logo