శనివారం 04 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 09, 2020 , 16:42:35

బడుగు బలహీన వర్గాల దేవుడు కేసీఆర్‌

బడుగు బలహీన వర్గాల దేవుడు కేసీఆర్‌

-సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసిన జీపీ సిబ్బంది
పర్వతగిరి, జనవరి 08 : మండలంలోని చింతనెక్కొండ గ్రామంలో పంచాయతీ ఉద్యోగులు పెంచిన జీతం తీసుకున్న సందర్భంగా బుధవారం సీఎం కేసీఆర్‌ చిత్ర పటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. సర్పంచ్‌ గటిక సుష్మా నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో జీపీ సిబ్బంది మాట్లాడుతూ నిత్యం పేద ప్రజల అభ్యున్నతి కోసం కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. జీపీ సిబ్బందికి జీతాలు పెంచడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో కారోబార్‌ రవి, ఉపసర్పంచ్‌ దర్నోజు దేవేందర్‌, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు జీడి గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.


logo