శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 09, 2020 , 16:42:08

పాకాలను సందర్శించిన విద్యార్థులు

పాకాలను సందర్శించిన విద్యార్థులు

ఖానాపురం, జనవరి 08 : మండలంలోని మంగళవారిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం పాకాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాకాలలోని ఔషధ మొక్కల పార్కు, సీతాకోకచిలుకల పార్కు, పర్యావరణ అధ్యయన కేంద్రాన్ని తిలకించారు. అనంతరం ఉపాధ్యాయులు సుధాకర్‌, కీర్య మాట్లాడుతూ విద్యార్థుల్లో వన విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఇలాంటి విజ్ఞాన దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేశ్‌, సునీత, సబియా తదితరులు పాల్గొన్నారు.


logo