ఆదివారం 24 మే 2020
Warangal-city - Jan 09, 2020 , 16:41:06

ఎన్నికల మీడియా సెంటర్‌ ఏర్పాటు

ఎన్నికల మీడియా సెంటర్‌ ఏర్పాటు

పరకాల, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్‌ ఎం హరిత ఆదేశాల మేరకు అధికారులు కలెక్టరేట్‌లో మీడియా సెంటర్‌, టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ప్రజలకు ఎలాంటి సందేహాలు, ఫిర్యాదులు ఉన్నా 1800-4253424 నెంబర్‌కు ఫోన్‌ చేయవచ్చని కలెక్టర్‌ బుధవారం తెలిపారు. కంట్రోల్‌ రూమ్‌లో ఏర్పాటు చేసిన ఈ టోల్‌ఫ్రీ నెంబర్‌ బాధ్యతలను జిల్లా ఉపాధి అధికారి మాధవికి అప్పగించారు. టోల్‌ఫ్రీ నెంబర్‌కు వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తానని కలెక్టర్‌ పేర్కొన్నారు. వివిధ పత్రికల్లో వచ్చే న్యూస్‌లలో పెయిడ్‌ ఆర్టికల్స్‌ని పరిశీలించి రోజువారీ రిపోర్ట్స్‌ ఇవ్వాల్సిందిగా నోడల్‌ అధికారి, డీపీఆర్‌వో పల్లవి, హార్టికల్చర్‌ ఏడీ శ్రీనివాస్‌ను ఆదేశించారు. మున్సిపల్‌ ఎన్నికలు జరిగే పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో కూడా మీడియా మానిటరింగ్‌ సెల్‌ను ఏర్పాటు చేసి, లోకల్‌గా ప్రసారమయ్యే ఛానల్స్‌లో వచ్చే పెయిడ్‌ బులిటెన్‌లను గమనించి రిపోర్టు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.


logo