శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 09, 2020 , 16:11:19

నామినేషన్ల పర్వం షురూ..

నామినేషన్ల పర్వం షురూ..

-పరకాలలో ఆరు, నర్సంపేటలో నాలుగు

-ఖాతా తెరవని వర్ధన్నపేట

-మొదటిరోజు మున్సిపల్‌ కార్యాలయాల వద్ద నాయకుల కోలాహలం

-మొదటిరోజు ఆరు నామినేషన్లు టీఆర్‌ఎస్‌ నుంచి ఐదు, బీజేపీ నుంచి ఒకటి


పరకాల మున్సిపాలిటీకి ఎన్నికలకు సంబంధించి మొదటిరోజు ఆరు నామినేషన్లు దాఖలా అయ్యాయి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా పరకాల పురపాలక సంఘంలోని సమావేశ మందిరంలో జిల్లా ఉప ఎన్నికల అధికారి కిషన్‌, సహాయ ఎన్నికల అధికారి రాజు ఆధ్వర్యంలో ఏడు నామినేషన్‌ దాఖలా కేం ద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం 10.30గంటలకు రిటర్నింగ్‌ అధికారులు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఏడుగురు రిటర్నింగ్‌ అధికారులు మొత్తం 22వార్డులకు గానూ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవగా మధ్యాహ్నం వరకు ఒక్క నామినేషన్‌ కూడా దాఖలా కాలేదు. మధ్యాహ్నం 3గంటల తరువాత టీఆర్‌ఎస్‌ నుంచి బండి రమాదేవి తన నామినేషన్‌ను దాఖలా చేశారు. అప్పటి నుంచి సాయంత్రం 5గంటల వరకు మొత్తం ఆరు నామినేషన్లు దాఖలా అయినట్లు జిల్లా సహాయ ఎన్నికల అధికారి, కమిషనర్‌ రాజు తెలిపారు.


నామినేషన్లు దాఖలు చేసింది వీరే..

పరకాల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా అధికారులు మొదటిరోజు బుధవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభించగా మొత్తం ఆరుగురు అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారులకు అందించారు. ఇందులో 16వ వార్డులో టీఆర్‌ఎస్‌ నుంచి మొదటి నామినేషన్‌ను బండి రమాదేవి అందించారు. అదేవిధంగా టీఆర్‌ఎస్‌ నుంచి పసుల లావణ్య (10వ వార్డు), పాలకుర్తి గోపి (17వ వార్డు), మడికొండ శ్రీను (1వ వార్డు), సాంబరాజు జ్యోతి (13వ వార్డు), బీజేపీ నుంచి ఆర్పీ జయంతిలాల్‌ (21వ వార్డు) తమ నామినేషన్లను దాఖలా చేశారు. ఇందులో 16వ వార్డు జనరల్‌ మహిళకు రిజర్వు కాగా 10వ వార్డు ఎస్సీ మహిళ, 17వ వార్డు ఎస్టీ, 1వ వార్డు ఎస్సీ జనరల్‌, 13వ వార్డు ఎస్సీ మహిళ, 21వ వార్డు జనరల్‌ స్థానాలకు రిజర్వు అయ్యాయి.


మున్సిపల్‌ ఎన్నికల పర్వం మొదలైంది. నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఘట్టం బుధవారం ప్రారంభమైంది. అభ్యర్థుల నుంచి రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్లను స్వీకరించారు. అయితే పలు పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున తరలిరావడంతో మున్సిపల్‌ కార్యాలయాలన్నీ కిక్కిరిసి పోయాయి. దీంతో పరకాల మున్సిపాలిటీకి ఆరు, నర్సంపేటలో నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. వర్ధన్నపేటలో బుధవారానికి నామినేషన్లు రాలేదని రిటర్నింగ్‌ అధికారులు వెల్లడించారు.


పరకాల, నమస్తే తెలంగాణ : పరకాల పురపాలక సంఘా నికి జరిగే మొట్టమొదటి ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ఘట్టం బుధవారం ప్రారంభమైంది. మొదటిరోజు ఉదయం 10.30 గంటలకు ఏడుగురు రిటర్నింగ్‌ అధికారులు మొత్తం 22 వార్డులకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. 10.30 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. దీంతో నామినేషన్లు వేయాలనుకునే వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు హడావుడిగా కనిపించారు. ఇంటి, నల్లా పన్నుల బకాయిలు ఉన్నవారు పన్నులను చెల్లించి నో డ్యూ సర్టిఫికెట్లను పొందారు. కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ వద్ద వివరాలను తెలుసుకుంటూ నామినేషన్‌ పత్రాలను స్వీకరించారు. మొదటిరోజు సాయంత్రం 5గంటలు ముగిసే సరికి సు మారు 80 మందికిపైగా నామినేషన్‌ పత్రాలను తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.


రూ.3.60లక్షలు వసూల్‌..

పరకాల మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్‌ దాఖ లా చేయాలనుకునే అభ్యర్థులు, వారి ప్రతిపాదకులు నామినేష న్ల స్వీకరణ మొదటిరోజు మొత్తం రూ.3.60 లక్షలు మున్సిపాలిటీకి చెల్లించారు. కౌన్సిలర్‌గా నామినేషన్‌ వేయాలనుకునే అభ్య ర్థి, వారి ప్రతిపాదకుడు ఇంటి, నల్లా పన్నులతోపాటు ఇతరత్రా ఎలాంటి బకాయిలు మున్సిపాలిటీకి ఉండొద్దు. దీంతో నామినేషన్‌ వేయాలనుకునే అభ్యర్థులు తమతోపాటు తమ ప్రదిపాదకులకు సంబంధించిన బకాయిలను పూర్తిగా చెల్లించి నోడ్యూ సర్టిఫికెట్లను పొందారు. ఇందుకోసం పరకాల ము న్సిపాలిటీకి సంబంధించిన ఏడుగురు బిల్‌ కలెక్టర్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేశారు. నామినేషన్ల మొదటిరోజు రూ.2.30లక్షలు, నల్లా పన్ను రూ.70వేలు, నో డ్యూ సర్టిఫికెట్‌ కోసం చెల్లించిన రుసుము రూ.60వేలు మొత్తం రూ.3.60లక్షలు వసూలైనట్లు మున్సిపల్‌ కమిషనర్‌ రాజు తెలిపారు.


logo