ఘనంగా టీఆర్ఎస్ జెండా పండుగ
వాడవాడలా వేడుకలు
ఉత్సాహంగా పాల్గొన్న పార్టీ శ్రేణులు
వరంగల్/వరంగల్‌చౌరస్తా/కరీమాబాద్/ఖిలావరంగల్/పోచమ్మమైదాన్/కాశీబుగ్గ, సెప్టెంబర్ 2: వరంగల్ నగరం గురువారం గులాబీమయమైంది. దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు భూమిపూజ చేసిన సందర్భంగా టీఆర్ఎస్ జెండా పండుగ నిర్వహంచారు. 11వ డివిజన్ కాకతీయ టాకీస్ సెంటర్లో కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి ఆధ్వర్యంలో జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వద్దిరాజ్ గణేశ్, డివిజన్ ఇన్చార్జి బొల్లికొండ వీరేందర్, టీఆర్ఎస్ నాయకులు దేవరకొండ సురేందర్, రఘురాజు, సృజనకాంత్, మాలకుమ్మరి పరశురాములు, నాగరాజు, అయేషాఫాతిమా, సుభద్ర పాల్గొన్నారు. 28వ డివిజన్లో కార్పొరేటర్ గందె కల్పన టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. 26వ డివిజన్లో కార్పొరేటర్ బాలిన సురేశ్ ఆధ్వర్యంలో జెండా పండుగ నిర్వహించారు. 27వ డివిజన్ పరిధిలో మాజీ కార్పొరేటర్ జారతి రమేశ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కరీమాబాద్ అండర్ రైల్వేగేట్ ప్రాంతంలోని డివిజన్లలో కార్పొరేటర్లు పల్లం పద్మ, ముష్కమల్ల అరుణ, సిద్ధం రాజు, మరుపల్ల రవి, పోశాల పద్మ, ఈదురు అరుణ ఆధ్వర్యంలో జెండా పండుగ వేడుకలు జరిగాయి. రంగశాయిపేటలో ఖిలావరంగల్ పీఏసీఎస్‌లో చైర్మన్ కేడల జనార్దన్ ఆధ్వర్యంలో జెండాను ఎగురవేశారు. ఉర్సులో తెలంగాణ ఉద్యమకారుడు గులాబీచొక్కా రమేశ్‌ను కార్పొరేటర్ పోశాల పద్మ సత్కరించారు. జన్మభూమి జంక్షన్లో ఉద్యమకారుడు అచ్చ వినోద్‌కుమార్ టీఆర్ఎస్ జెండా ఎగురవేశారు.
అండర్‌రైల్వేగేట్ ప్రాంతంలోని డివిజన్లు గులాబీమయంగా మారాయి. ఖిలావరంగల్ ప్రాంతం 17వ డివిజన్ వసంతపురంలో కార్పొరేటర్ గద్దె బాబు, బొల్లికుంటలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ సోల్తి భూమాత జెండాను ఆవిష్కరించారు. మార్కెట్ డైరెక్టర్ తుమ్మ రవీందర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణలత వజ్రయ్య, వేమనరెడ్డి, రాజుగౌడ్, సోల్తి నరేందర్ స్వీట్లు పంపిణీ చేశారు. 34వ డివిజన్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి ఆధ్వర్యంలో జెండాను ఉద్యమకారుడు పగడాల సతీశ్, టీఆర్ఎస్వీ కార్యదర్శి కలకొండ అభినాశ్ ఎగుర వేసి స్వీట్లు పంపిణీ చేశారు. 35వ డివిజన్లో కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. మర్రి శ్రీనివాస్, కుడికాల సుధాకర్, కానుగంటి స్వామి, చింతం ప్రవీణ్, గడ్డం సుధాకర్ పాల్గొన్నారు. 36వ డివిజన్లో డిప్యూటీ మేయర్ రిజ్వానాషమీమ్ మసూద్ ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ జెండాను ఉద్యమకారుడు ఎండీ చాంద్‌పాషా ఎగుర వేసి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గడల రమేశ్, మర్రి శ్రీనివాస్, వేల్పుగొండ యాకయ్య, సమీనా పాల్గొన్నారు. 37వ డివిజన్లో కార్పొరేటర్ బోగి సువర్ణాసురేశ్ టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఉద్యమకారులు ఎస్ చందర్, నాయకులు అర్సం రాంబాబు, ఎండీ ఉల్ఫత్, మహేశ్, వాసు, శ్రీధర్‌రెడ్డి, కరుణాకర్ పాల్గొన్నారు. పోచమ్మమైదాన్ 21వ డివిజన్లోని డీసెంట్ ఫంక్షన్ హాల్ వద్ద కార్పొరేటర్ ఎండీ పుర్కాన్ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి జెండాను ఎగురువేశారు.
13వ డివిజన్ దేశాయిపేటలోని బాబు జగ్జీవన్‌రాం జంక్షన్ వద్ద కార్పొరేటర్ సురేశ్‌కుమార్ జోషి జెండాను ఆవిష్కరించారు. 12వ డివిజన్లో కార్పొరేటర్ కావటి కవిత ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుడు నీలం రాజ్‌కిశోర్ పార్టీ జెండాను ఎగురవేశారు. కార్పొరేటర్ కవిత దేశాయిపేటలోని బొడ్రాయి వద్ద పూజలు చేశారు. 23వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ జెండాను ఆవిష్కరించారు. 20వ డివిజన్ కాశీబుగ్గలో కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్ వేడుకలు నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ బయ్యాస్వామి, పెండ్యాల సోని, వంగరి రవి, ఇక్బాల్, చిమ్మని సంతోష్, జక్కి అశోక్ పాల్గొన్నారు. కాశీబుగ్గ జంక్షన్లో మాజీ కార్పొరేటర్ ఓని భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సుధాకర్, పద్మ గంగాధర్, వెంకటేశ్, రంజిత్, బ్రహ్మచారి, గోపి పాల్గొన్నారు. 14వ డివిజన్ ఎస్ఆర్నగర్లో అధ్యక్షుడు పసులాది మల్లయ్య ఆధ్వర్యంలో టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ముడుసు నరసింహ, కేతిరి రాజశేఖర్, మచ్చర్ల స్టాలిన్ పాల్గొన్నారు.