e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home జనగాం నగరంలో భారీ చోరీ

నగరంలో భారీ చోరీ

  • పీజేఆర్‌ అపార్ట్‌మెంట్‌లోని మూడు ఫ్లాట్లలో దొంగలు
  • సుమారు రెండు కిలోల బంగారు ఆభరణాల అపహరణ
  • అంతర్రాష్ట ప్రొఫెషనల్‌ దొంగల ముఠాగా పోలీసుల అనుమానం

సుబేదారి, సెప్టెంబర్‌ 28: కాజీపేట పోలీస్‌స్టేషన్‌ పరిధి లోని ఫాతిమా-కేయూ వందఫీట్ల రోడ్డులో వడ్డేపల్లి చెరువు కట్ట కింద ఉన్న పీజేఆర్‌ అపార్ట్‌మెంట్‌లో తాళం వేసి ఉన్న మూడు ఫ్లాట్లలో సోమవారం తెల్లవారుజామున భారీ దొం గతనం జరిగింది. ప్రహరీపై ఉన్న ఇనుపతీగల ఫెన్సింగ్‌ను కట్‌చేసి, వాచ్‌మన్‌ షెడ్‌ డోర్‌కు గడియపెట్టి, ఇనుపరాడ్లతో చొరబడి నలుగురు దొంగలు సుమారు రెండు కిలోల బంగా రు ఆభరణాలను అపహరించారు. ఇది అంతర్రాష్ట్ర ప్రొఫెష నల్‌ దొంగల ముఠా పనేనని పోలీసులు అనుమానిస్తున్నా రు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తే 45నిమిషాల్లోనే దొంగలు యాక్షన్‌ కంప్లీట్‌ చేసినట్లు తెలుస్తుండగా, ఈ ఘటన నగ రంలో సంచలనం సృష్టించింది.

నలుగురు దొంగలు.. 45 నిమిషాలు
సీసీ ఫుటేజీలు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు సోమవారం తెల్లవారుజామున 2గంటల సమయంలో నలుగురు దొంగలు అపార్ట్‌మెంట్‌ వెనుకభాగంలో ప్రహ రీపై ఫెన్సింగ్‌ తీగను కట్‌ చేసి, రాడ్లు పట్టుకొని మోకాళ్ల వర కు ప్యాంట్లను మలుచుకొని లోనికి చొరబడ్డారు. వాచ్‌మన్‌ ఉంటున్న షెడ్‌ డోర్‌కు గడియపెట్టారు. మొదట ఏ బ్లాక్‌ ఫస్ట్‌ ఫ్లోర్‌లోకి మెట్ల ద్వారా వెళ్లారు. 102 ఫ్లాట్‌ తాళం పగులగొ ట్టి, బెడ్‌రూంలోని బీరువాను ధ్వంసం చేసి అందులో మూ డు తులాల బంగారు అభరణాలు, రూ.10వేల నగదు అప హరించారు. తర్వాత రెండో అంతస్తులో పక్కపక్కనే ఉన్న 202, 203 ఫ్లాట్లలో చొరబడ్డారు. నిట్‌(జాతీయ సాంకేతిక సంస్థ) రిటైర్డ్‌ ప్రొఫెసర్‌కు చెందిన 202 నంబర్‌ ఫ్లాట్‌లో 190 తులాల (సుమారు రెండు కిలోలు) బంగారు ఆభర ణాలను ఎత్తుకెళ్లారు. 203 ఫ్లాట్‌లో ఏమీ దొరక్కపోవ డం తో వస్తువులు, దుస్తులను చిందరవందరగా పడేసి వెళ్లారు.

- Advertisement -

వీకెండ్‌లో మూడు కుటుంబాల టూర్‌
చోరీ జరిగిన మూడు ఫ్లాట్లలో ఉండేవారు ఆదివారం వీకెండ్‌ కావడంతో టూర్‌కు వెళ్లారు. 102 ఫ్లాట్‌ ఓనర్‌ సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ చెంగల మానస్‌కుమార్‌, తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌ వెళ్లాడు. 202 ఫ్లాట్‌ ఓనర్‌ నిట్‌ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ వెంకటాచలం దంపతులు ఆదివారం ఉద యం ముంబైలో ఉన్న తమ బిడ్డ వద్దకు వెళ్లారు. 203 ఫ్లాట్‌ లో కిరాయి ఉండే వ్యాపారవేత్త వెలిచర్ల సౌజన్యకుమార్‌, అతడి భార్య(కేయూ ఎస్‌బీఐ బ్రాంచ్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌), తల్లీ, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు సోమవారం ఉదయం 9 గంటలకు సౌజన్యకుమార్‌ కుటుంబం తిరిగి వచ్చింది. అత డి తల్లి ఏసు ప్రేమ, ఇద్దరు పిల్లలు ఫ్లాట్‌ డోర్‌ తీద్దామని చూ డగా తాళం పగులగొట్టి ఉంది. బీరువా ఓపెన్‌ చేసి, బెడ్‌పై దుస్తులు చిందరవందరగా పడి ఉండడంతో ఏసుప్రేమ కొ డుక్కి విష యం చెప్పింది. అతడు పరిశీలించి పక్కనున్న 202 నంబర్‌ ఫ్లాట్‌ను కూడా గమనించగా దాని డోర్‌ తాళం కూడా పగుల గొట్టి ఉంది. వెంటనే ముంబైలో ఉన్న ఓనర్‌ సేలంకు ఫోన్‌ చేసి చోరీ విషయాన్ని సౌజన్యకుమార్‌ తెలియ జేశాడు. ఇదే మాదిరిగా ఫస్ట్‌ఫ్లోర్‌ 102 ఫ్లాట్‌లో కూడా చోరీ జరిగినట్లు గుర్తించారు. అన్ని కుటుంబాల వారు వచ్చాక సో మవారం రాత్రి వరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి సీసీ కెమెరాలను పరిశీలించారు. సోమవా రం వేకువజామున 2గంటలకు చొరబడిన దొంగలు 2.45 వరకు తిరి గి వెళ్లినట్లు రికార్డ్‌ అయింది. దొంగలు 25 నుంచి 30 ఏళ్ల వయస్సులోపు ఉన్నట్లు తెలుస్తున్నది. పక్కాగా రెక్కీ చేసి చో రీకి తెగబడినట్లు పోలీసులు భావిస్తు న్నారు.

అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనేనా?
పక్కా ప్లాన్‌తో ఇంతపెద్ద చొరీకి పాల్పడింది అంతర్రాష్ట్ర ప్రొఫెషనల్‌ దొంగలని పోలీసులు భావిస్తున్నారు. గతంలో ఇదే తరహాలో నగరంలో పలుచోట్ల దొంగతనాలు జరిగా యి. పదేళ్ల కిత్రం హనుమకొండ బాలసముద్రం అపార్ట్‌ మెంట్‌లోనూ ఇదే తరహా పెద్దమొత్తంలో బంగారం అపహ రణకు గురికాగా పోలీసులు రికవరీ చేసినట్లు సమాచారం. పీజేఆర్‌ అపార్ట్‌మెంట్‌లోనూ చోరీకి పాల్పడింది అంతర్రాష్ట్ర దొంగలేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలాంటి దొం గలు రైల్వే స్టేషన్‌, బస్‌స్టేషన్‌ దగ్గరి ప్రాంతాలను ఎంచుకొని రెక్కీ చేసి దొంగతనానికి పాల్పడి వెంటనే అక్కడి నుంచి పరారవుతారని చెబుతున్నారు.

అపార్ట్‌మెంట్‌లో ముగ్గురు పోలీస్‌ అధికారులు
ఇటీవల బదిలీ అయిన కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్‌, మడికొండ సీఐ రవికుమార్‌, విజిలెన్స్‌ సీఐ అమృతరెడ్డి ఇదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. 47 నెక్లెస్‌లు, ఆరు బంగారు గాజులు చోరీ అయిన ప్రొఫెసర్‌ వెంకటాచలం ఫ్లాట్‌కు దగ్గర లోనే సీఐ అమృత్‌రెడ్డి ఫ్లాట్‌ ఉంది. పోలీసులు నివాస ముం టున్న అపార్ట్‌మెంట్‌లోనే ఇంత పెద్ద ఎత్తున చోరీ జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనను వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు చాలెంజ్‌గా తీసుకున్నారు. సీపీ తరు ణ్‌జోషి ఆదేశాల మేరకు సెంట్రల్‌ డీసీపీ పుష్ప, కాజీపేట ఏసీపీ శ్రీనివాస్‌, కాజీపేట, మడికొండ, సుబేదారి సీఐలు, సీసీఎస్‌ ఏసీపీ బాబూరావు, క్లూస్‌టీం ఘటనా స్థ లానికి చేకుకొని ఆనవాళ్లు సేకరించారు. నిందితులను పట్టు కునేం దుకు ప్రత్యే క బృందాలను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపా రు. బాధితుల ఫిర్యాదు మేరకు కాజీపేట పోలీస్‌ స్టేష న్‌లో కేసు నమోదు చేసినట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement