e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home జనగాం ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతులు చేయాలి

ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతులు చేయాలి

  • సిబ్బంది విధిగా హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలి
  • పెండింగ్‌లో ఉన్న నాయీబ్రాహ్మణ, లాండ్రీ సర్వీస్‌లు మంజూరు చేయాలి
  • టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ గోపాల్‌రావు

హనుమకొండ సిటీ, సెప్టెంబర్‌ 28 : గులాబ్‌ తుఫాన్‌తో దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లను యుద్ధప్రాతిపదికన సరిచేయాలని టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు ఎస్‌ఈలను ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్‌ వ్యవస్థకు జరిగిన నష్టాలు, పునరుద్ధరణ పనులపై టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ పరిధిలోని 16 సర్కిళ్ల ఎస్‌ఈలతో సీఎండీ మంగళవారం హనుమకొండ విద్యుత్‌ భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాలతో జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్‌ స్తంభాలతో పాటు 33 కేవీ 27, 11కేవీ 24, ఎల్‌టీ 93 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నట్లు ఆయా సర్కిళ్ల ఎస్‌ఈలు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ వి ద్యుత్‌ సిబ్బంది విధిగా హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండేలా సంబం ధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నా యీబ్రాహ్మణ, లాండ్రీ, దోబీఘాట్‌లకు సర్వీస్‌లు మంజూ రు చేయకుండా మిగిలిపోయిన సర్వీసుల మంజూరును వేగవంతం చేయాలన్నారు. తుఫాను కారణంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో విద్యుత్‌ అందించి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్న అధికారులను సీఎండీ అభినందించారు. సమావేశంలో హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ బీ వెంకటేశ్వర్‌రావు, ఆపరేషన్‌ ఐపీపీ అండ్‌ ఆర్‌ఏపీ డైరెక్టర్‌ పీ గణపతి, కమర్షియల్‌ డైరెక్ట ర్‌ సంధ్యారాణి, పీఅండ్‌ ఎంఎం డైరెక్టర్‌ నర్సింగరావు, ప్రా జెక్ట్స్‌ డైరెక్టర్‌ మోహన్‌రెడ్డి, సీజీఎంలు కిషన్‌, రాజుచౌహాన్‌, మధుసూదన్‌, ప్రభాకర్‌, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement